Lionel Messi | అర్జెంటీనా ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ (Football icon) లియోనల్ మెస్సి (Lionel Messi) భారత పర్యటన ముగిసింది. ‘గోట్ ఇండియా టూర్’లో ఇండియాకి (GOAT India Tour) వచ్చిన మెస్సి.. నాలుగు రోజులపాటూ ప్రధాన నగరాల్లో సందడి చేశారు. తన ఇండియా టూర్ ముగిసిన సందర్భంగా మెస్సి ఇన్‌స్టా వేదికగా భావోద్వేగ పోస్టు పెట్టారు. ‘గోట్ టూర్’లో ఇండియా తనకు గొప్ప ఆతిథ్యం ఇచ్చిందంటూ చెప్పుకొచ్చారు. ఈ మేరకు భారత్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేక వీడియోను పంచుకున్నారు.
‘నమస్తే ఇండియా..! ఈ పర్యటనలో నాకు ఆతిథ్యం ఇచ్చిన ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా నగరాలకు ప్రత్యేక కృతజ్ఞతలు. వెళ్లిన ప్రతీచోటా ఆత్మీయ స్వాగతం, గొప్ప ఆతిథ్యం, అఖండమైన ప్రేమ లభించింది. అందుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. భారత్‌లో ఫుట్‌బాల్‌కు ఎంతో భవిష్యత్తు ఉందని ఆశిస్తున్నాను’ అంటూ వీడియోకి క్యాప్షన్ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతోంది.
Also Read..
Mahatma Gandhi | హే రామ్!.. ఉపాధి హామీ పథకం నుంచి మహాత్ముడిపేరు తొలగింపు..
Digital Arrest | డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.2 కోట్ల లూటీ
ఏక్యూఐ.. ఏక్యూఐ.. ఢిల్లీ సీఎంకు వ్యతిరేకంగా ప్రేక్షకుల నినాదాలు