PM Modi : విలక్షణ నటుడు కోట శ్రీనివాస్‌రావు (Kota Srinivas Rao) మృతికి ప్రధాన మంత్రి (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. కోట శ్రీనివాస్‌రావు తన అద్భుతమైన నటనతో నాలుగు దశాబ్దాలపాటు ప్రేక్షకులను అలరించారని ప్రధాని కీర్తించారు.
నటన మాత్రమే కాకుండా కోట పలు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ తనవంతు పాత్ర పోషించారని గుర్తుచేసుకున్నారు. ఈ మేరకు ప్రధాని తన సోషల్ మీడియా ఖాతాలో ఒక పోస్టు పెట్టారు. కాగా కోట శ్రీనివాస్ రావు వృద్ధాప్యసంబంధ అనారోగ్యంతో ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకు తుదిశ్వాస విడిచారు.
సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. కోట శ్రీనివాస్‌రావు మనవడు శ్రీనివాస్ చేతుల మీదుగా కోట అంతిమ సంస్కారాలు జరిగాయి. కోట తన కెరీర్ మొత్తంలో 750కిపైగా సినిమాల్లో నటించారు. విలక్షణమైన నటనతో ఆయన తెలుగు సీనిరంగంలో తనదైన ముద్ర వేశారు.