PM Modi | దేశ రాజధాని ఢిల్లీ (Delhi)ని తీవ్రమైన పొగమంచు కమ్మేసింది. దీంతో దృశ్యమానత పడిపోయింది. కొన్ని మీటర్ల దూరంలో వెళ్తున్న వాహనాలు కూడా కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఈ కారణంగా విమాన, రైలు సహా వాహనాల రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పొగమంచు కారణంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మూడు దేశాల పర్యటనలో జాప్యం నెలకొంది.
ప్రధాని మోదీ జోర్దాన్ (Jordan), ఇథియోపియా (Ethiopia), ఒమన్ (Oman) దేశాల పర్యటనకు వెళ్లాల్సి ఉంది. ఇవాళ ఉదయం 8:30 గంటలకు బయల్దేరాల్సి ఉండగా.. పొగమంచు కారణంగా ప్రయాణం ఆలస్యమైంది. దాదాపు రెండు గంటల ఆలస్యంగా ప్రధాని మూడు దేశాల పర్యటనకు బయల్దేరి వెళ్లారు. దృశ్యమానత కాస్త మెరుగుపడిన అనంతరం విమానం టేకాఫ్‌కు అధికారులు అనుమతించారు.
నేపథ్యంలో ప్రయాణికులకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు (Delhi Airport) కీలక అడ్వైజరీ జారీ చేసింది. ప్రయాణికులు తమ విమాన స్టేటస్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. ఇండిగో, ఎయిరిండియా వంటి పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీలు జారీ చేశాయి. విమానాశ్రయంలో దృశ్యగోచరత తగ్గడం వల్ల పలు విమానాలు రద్దు కాగా.. మరికొన్ని ఆలస్యమయ్యాయని తెలిపాయి. విమానాల స్టేటస్ గురించి తెలుసుకోవడం కోసం తమ వెబ్సైట్లను పరిశీలిస్తూ ఉండాలని ప్రయాణికులకు సూచించాయి.
Also Read..
Air Pollution | ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. 500కి చేరిన గాలి నాణ్యత.. విమాన, రైలు రాకపోకలపై ప్రభావం
Sinkholes | సింక్ హోల్స్‌తో తుర్కియేలో వ్యవసాయ సంక్షోభం.. ఏటికేడు పెరుగుతూ వస్తున్న ముప్పు