Nuclear Device | హిమాలయాల్లో న్యూక్లియర్ డివైస్.. ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి డివైస్‌తో మానవాళికి ముప్పు
హిమాలయాల్లోని నందా దేవి కొండల్లో ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి న్యూక్లియర్ డివైస్ కూరుకుపోయింది. చైనాపై గూఢచర్యం కోసం 1965లో సీఐఏ రహస్యంగా ఓ మిషన్‌ను నిర్వహించింది.
న్యూఢిల్లీ: హిమాలయాల్లోని (Himalayas) నందా దేవి కొండల్లో (Nanda Devi Hills) ప్రచ్ఛన్న యుద్ధ కాలం నాటి న్యూక్లియర్ డివైస్ (Nuclear Device) కూరుకుపోయింది. చైనాపై (China)గూఢచర్యం కోసం 1965లో సీఐఏ రహస్యంగా ఓ మిషన్‌ను నిర్వహించింది. దీనిలో భాగంగా ప్లుటోనియం పవర్డ్ జనరేటర్‌ను అమెరికన్, ఇండియన్ పర్వతారోహకులు తీసుకెళ్లారు. అది ప్రమాదవశాత్తూ ఇక్కడ పడిపోయింది. దీని ప్రభావం పర్యావరణంపై పడుతుందనే ఆందోళన దశాబ్దాల నుంచి వ్యక్తమవుతున్నది. జపాన్‌లోని నాగసాకిపై వేసిన అణు బాంబులో ఉన్న పీయూ-239 ఐసోటోప్, అత్యధిక రేడియోధార్మిక ఇంధనం పీయూ-238 ఈ డివైస్‌లో ఉండటంతో ఆందోళన వ్యక్తమవుతున్నది.
అయితే, దీనిని ఇక్కడ పోగొట్టుకున్న విషయాన్ని అంగీకరించడానికి అమెరికా ఇప్పటికీ తిరస్కరిస్తున్నది. ఈ మిషన్‌ను నిర్వహించిన వారిని విస్తృత స్థాయిలో ఇంటర్వ్యూలు చేసినపుడు, అమెరికా, భారత్ ప్రభుత్వాల వద్ద ఉన్న రహస్య పత్రాలను పరిశీలించినపుడు, ఈ డివైస్ గురించి బయటపడింది. ఈ డివైస్‌పై సమాధానం చెప్పాలని భారతీయులు 1970వ దశకం నుంచి ఇప్పటికీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ న్యూక్లియర్ డివైస్ మంచు ప్రవాహంలో కొట్టుకొస్తే, రేడియో ధార్మిక పదార్థం గంగా నదిలో కలిస్తే, కోట్లాది మందికి క్యాన్సర్ ముప్పు తప్పదని హిమాలయాల సమీపంలోని గ్రామస్థులు, పర్యావరణవేత్తలు, రాజకీయ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్లుటోనియం అత్యంత విషపూరిత పదార్థం. ఇది నీటిలో కలిస్తే క్యాన్సర్‌కు కారణమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

