బుధవారం 27 జనవరి 2021
National - Jan 14, 2021 , 02:09:49

లీటరు పెట్రోల్‌ రూ.91

లీటరు పెట్రోల్‌ రూ.91

  • భగ్గుమన్న ఇంధన ధరలు

న్యూఢిల్లీ, జనవరి 13: పెట్రోల్‌, డీజిల్‌ ధరలు మరోసారి పెరిగాయి. బుధ వారం లీటరు పెట్రోల్‌పై 25 పైసలు, లీటరు డీజిల్‌పై 25 పైసలను ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు పెంచాయి. దీంతో గతంలో ఎన్నడూ లేనివిధంగా దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.84.45కి పెరిగింది. లీటరు డీజిల్‌ ధర రూ.74.63కి చేరింది. ఇక ముంబైలో లీటరు పెట్రోల్‌ ధర రూ.91.07కు చేరుకోగా, లీటరు డీజిల్‌ ధర రికార్డుస్థాయిలో రూ.81.34కి పెరిగింది. గతేడాది మే నుంచి ఇప్పటి వరకు లీటరు పెట్రోల్‌పై రూ.14.79, లీటరు డీజిల్‌పై రూ.12.34 పెరిగింది.


logo