Delhi Quake | అఫ్గానిస్థాన్‌లోని (Afghanistan) హిందూకుష్ (Hindu Kush) పర్వతాల్లో మంగళవారం రాత్రి 10.17 గంటల సమయంలో భూకంపం (earthquake) సంభవించిన విషయం తెలిసిందే. రిక్టర్‌స్కేలుపై తీవ్రత 6.6గా నమోదైంది. కాబూల్‌కు 300 కిలోమీటర్ల దూరంలోని జుర్మ్ (Jurm) సమీపంలో, 187.6 కిలోమీటర్ల లోతున భూకంపం కేంద్రాన్ని గుర్తించినట్టు అమెరికా జియోలాజికల్ సర్వే (USGS) వెల్లడించింది. దీని ప్రభావంతో ఉత్తరభారతంలోనూ భూప్రకంపనలు సంభవించాయి. ఢిల్లీ (Delhi), హర్యానా, పంజాబ్, రాజస్థాన్, జమ్ముకశ్మీర్, ఉత్తరప్రదేశ్‌లో భూమి కంపించింది.
ఢిల్లీలో సుమారు 2 నిమిషాల పాటు భూమి కంపించింది. ఇండ్లు, భవనాలు ఊగిపోయాయి. దీంతో ప్రజలు భయంతో రోడ్లపైకి పరుగులు పెట్టారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను కొందరు తమ ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇండ్లలో ఫ్యాన్లు, వస్తువులు ఊగుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
ఈ భూకంపం ధాటికి పాకిస్థాన్ అతలాకుతలమైంది. ఖైబర్ ఫంక్తున్‌ఖ్వా ప్రావిన్స్‌లో (Khyber Pakhtunkhwa province) ప్రాణ నష్టంతోపాటు భారీగా ఆస్తినష్టం సంభవించింది. భూకంపం వల్ల ఖైబర్ ప్రావిన్స్‌లో ఇప్పటివరకు తొమ్మిది మంది మరణించగా, వంద మందికిపైగా గాయపడ్డారని పాక్ ఎమర్జెన్సీ సర్వీసెస్ అధికార ప్రతినిధి బిలాల్ ఫైజీ తెలిపారు.
Earthquake at Delhi NCR…
Hope everyone is safe…. pic.twitter.com/T8hrkr8Yoc
— manish sindwani (@manish_sindwani) March 21, 2023
VIDEO | People rush out of their houses in Delhi-NCR as earthquake felt in north India. pic.twitter.com/qfxYolZhy2
— Press Trust of India (@PTI_News) March 21, 2023
Delhi University North campus#earthquake #delhincrearthquack #earthquake #DelhiNCR#भूकंप pic.twitter.com/FxBmzd0cez
— ABHISHEK KUMAR YADAV (@abhishek9541340) March 21, 2023
Delhi University North campus#earthquake #delhincrearthquack #earthquake #DelhiNCR#भूकंप pic.twitter.com/laTo8Y6ks2
— Subhash Suman (@Subha7Suman) March 21, 2023
Insanely scary #earthquake at Delhi, running down 11 floors while the building swung. #Gurgaon pic.twitter.com/cugvMduQgQ
— Aparajita Bahadur (@foot_loose_apra) March 21, 2023
#WATCH | Uttar Pradesh: People rush out of their houses in Vasundhara, Ghaziabad as strong earthquake tremors felt in several parts of north India. pic.twitter.com/wg4MWB0QdX
— ANI (@ANI) March 21, 2023
Also read..
India Corona | దేశంలో ఏడు వేలు దాటిన యాక్టివ్ కేసులు
Usha Gokani | మహాత్మాగాంధీ మనవరాలు మృతి