Kamineni Srinivas | కైకలూరు బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల నుంచి ఎప్పుడో విరమించుకోవాలనుకున్నా అని తెలిపారు. కానీ అందరూ కోరుకోవడంతో 2024లో పోటీచేశానని వెల్లడించారు. ఎన్నికల్లో ఊహించని మెజారిటీ తనకు వచ్చిందని చెప్పారు.
భవిష్యత్తులో నేను, నా కుటుంబసభ్యులు ఎన్నికల్లో పోటీ చేయబోమని కామినేని స్పష్టం చేశారు. ఇకపై మంచి పనులు చేసి పేరు తెచ్చుకుంటానని చెప్పారు. నియోజకవర్గంలో అన్యాయం, అక్రమాలు చేస్తే ఎవరినీ ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.