India Corona | దేశంలో ఏడు వేలు దాటిన యాక్టివ్ కేసులు
India Corona | దేశంలో (India) మళ్లీ కరోనా వైరస్ (Corona Virus) కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత నాలుగు రోజులుగా వెయ్యి చేరువలో కేసులు నమోదవుతున్నాయి.
India Corona | దేశంలో (India) మళ్లీ కరోనా వైరస్ (Corona Virus) కేసులు పెరుగుతున్నాయి. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. గత నాలుగు రోజులుగా వెయ్యి చేరువలో కేసులు నమోదవుతున్నాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Ministry of Health) అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో 1,03,831 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 1,134 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజా కేసులతో దేశంలో మొత్తం కరోనా బారిన పడిన వారి సంఖ్య 4,46,98,118 కి చేరింది.
ప్రస్తుతం దేశంలో 7,026 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. గత 24 గంటల్లో ఛత్తీస్గఢ్, ఢిల్లీ, గుజరాత్, మహారాష్ట్ర, కేరళలో ఒక్కొక్కరు చొప్పున మొత్తం ఐదుగురు మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 5,30,813కి చేరింది. కరోనా మహమ్మారి నుంచి ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా 4,41,60,279 మంది కోలుకున్నారు.
ఇప్పటివరకు నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల్లో 0.02 శాతం మాత్రమే యాక్టివ్గా ఉన్నాయని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. రికవరీ రేటు 98.79 శాతంగా, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 220.65 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది.
Also Read..
Usha Gokani | మహాత్మాగాంధీ మనవరాలు మృతి
MLC Kavitha | ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలి : ఎమ్మెల్సీ కవిత
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

