మహబూబ్నగర్ : మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ‘బాకీ కార్డుల’ను(Congress Baki cards) ఆవిష్కరించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా విఫలమైనదని ఆరోపించారు. మహిళలకు, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు, కళ్యాణ లక్ష్మి,షాదీ ముబారక్ పథకాల ద్వారా ఆర్థిక సహాయం, విద్యార్థులకు స్కూటీలు, రైతులకు రైతు భరోసా సహాయం మరియు రుణమాఫీ చేయకుండా ప్రజలకు బాకీ పడిందన్నారు.
ఇచ్చిన మాట తప్పిన కాంగ్రెస్ నాయకులను ఎక్కడిక్కడ నిలదీయాలన్నారు. ఈ బాకీలు ఎప్పుడూ చెల్లిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు.