Parliaments Winter Session | పార్లమెంట్ శీతాకాల సమావేశాల (Parliaments Winter Session) తేదీలు ఖరారయ్యాయి. నవంబర్ 25 నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) మంగళవారం ప్రకటించారు. డిసెంబర్ 20 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ మేరకు పార్లమెంట్ ఉభయసభలను సమావేశపరచాలనే ప్రభుత్వ ప్రతిపాదనకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు.
అదేవిధంగా భారత రాజ్యాంగాన్ని ఆమోదించి ఈ నవంబర్ 26 నాటికి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా (75th anniversary of the adoption of the Indian Constitution) ఆ రోజు పార్లమెంట్ ఉభయసభ ప్రత్యేక సంయుక్త సమావేశాన్ని నిర్వహించనున్నట్లు కిరణ్ రిజుజు తెలిపారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ మన రాజ్యాంగాన్ని ఆమోదించిన న్యూఢిల్లీలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్లో (Central Hall of Samvidhan Sadan) ఉభయ సభల సభ్యులు సమావేశం కానున్నారు. కాగా ఇదివరకూ నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా నిర్వహించేవారు. కానీ రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకొని 2015 నుంచి నవంబర్ 26ను కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ దినోత్సవంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
Hon’ble President, on the recommendation of Government of India, has approved the proposal for summoning of both the Houses of Parliament for the Winter Session, 2024 from 25th November to 20th December, 2024 (subject to exigencies of parliamentary business). On 26th November,… pic.twitter.com/dV69uyvle6
— Kiren Rijiju (@KirenRijiju) November 5, 2024
మరోవైపు ఈ శీతాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు మొదలైనవి సభ ముందుకు రాబోతున్నట్టు తెలిసింది. ఈ సమావేశాల్లోనే వక్ఫ్ సవరణ బిల్లును ఆమోదింపజేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఇప్పటికే ప్రకటించారు. గురుగావ్ ఎన్నికల ప్రచారంలోనూ ఆయన ఈ అంశాన్ని ప్రస్తావించారు. మరోవైపు విపక్షాలు జమిలి ఎన్నికలు, వక్ఫ్ సవరణ బిల్లు-2024ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దీంతో విపక్షాలు, అధికార ఎన్డీయే కూటమి సభ్యుల మధ్య పార్లమెంట్లో వాడి వేడి చర్చ సాగే అవకాశం ఉంది.
Also Read..
Noel Tata | టాటా సన్స్లోకి అడుగుపెట్టిన నోయల్ టాటా.. అధికారికంగా ప్రకటించిన బోర్డు
Unstoppable | జ్యోతిక లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. అన్స్టాపబుల్ షోలో సూర్య ఎమోషనల్