Hippo | మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Elections) ప్రారంభం కానున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ (Kamala Harris), రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బరిలోకి దిగారు. వీరిద్దరి మధ్య హోరాహోరీ పోరు తప్పదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ వెలువడిన అత్యధిక సర్వేలు కూడా కొన్ని ట్రంప్, మరికొన్ని కమలా హారిస్ గెలుపొందే అవకాశాలు ఉన్నట్లు వెల్లడించాయి. అయితే, లీడ్‌లో ఎవరున్నా ఇద్దరి మధ్య స్వల్ప తేడా మాత్రమే ఉండటం గమనార్హం. దీంతో ఈ ఎన్నికలు ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మరికాసేపట్లో వీరి భవిష్యత్తుపై అమెరికన్లు తీర్పు చెప్పనున్నారు.
ఈ క్రమంలో యూఎస్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారో థాయ్‌లాండ్‌కు చెందిన ఓ హిప్పో జోష్యం చెప్పడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ట్రంప్, కమలా హారిస్ .. వీరిద్దరిలో అమెరికా తదుపరి అధ్యక్షులుగా ఎవరు అన్నది థాయ్‌లాండ్‌లోని సి రాచా (Si Racha)లో గల ఖావో ఖీవ్ ఓపెన్ జూ (Khao Kheow Open Zoo) నిర్వాహకులు ఓ పోటీ నిర్వహించారు. ఈ పోటీలో పాల్గొన్న ఇంటర్నెట్ సెన్సేషన్ (internet sensation) బేబీ హిప్పో మూ డెంగ్ (Moo Deng).. అమెరికా తదుపరి అధ్యక్షడిగా ట్రంపే గెలుస్తారని చెప్పింది. అదెలా అంటారా..? జూ నిర్వహకులు ఇందుకోసం గుమ్మడికాయ పోటీ నిర్వహించారు.
ఇందులో భాగంగా ఓ గుమ్మడికాయను రెండు ముక్కలు చేసి ఓ చోట ఉంచారు. అందులో ఒకదానిపై ట్రంప్ పేరు, మరోదానిపై కమలా హారిస్ పేరు రాసి పెట్టారు. బేబీ హిప్పో ఎవరి పేరున్న గుమ్మడికాయ తింటే వారే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారని నమ్మకం పెట్టుకున్నారు. అయితే ఈ పోటీల్లో హిప్పో.. ట్రంప్ పేరున్న గుమ్మడికాయ ముక్కనే కొరికి అమెరికా తదుపరి అధ్యక్షుడిగా ట్రంపే అని జోష్యం చెప్పింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Moo Deng, famous baby hippo, predicts Donald Trump will win the election. pic.twitter.com/UqUnRhU0Nr
— The Rabbit Hole (@TheRabbitHole84) November 4, 2024
కాగా, మూ డెంగ్ హిప్పో చాలా ఫేమస్. దీనికి సోషల్ మీడియాలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇటీవలే మైఖేల్ జాక్సన్ ఫేమస్ డ్యాన్స్ మూన్ వాక్‌తో ఇంటర్నెట్ సస్సేషన్గా మారిన విషయం తెలిసిందే. మూన్ వాక్ మూమెంట్స్‌తో ఈ హిప్పో అదరగొట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది.
Whoa stop everything….Moo Deng doing the moonwalk 🤣 pic.twitter.com/vVKmXfIADN
— Wu Tang is for the Children (@WUTangKids) October 1, 2024
Also Read..
Noel Tata | టాటా సన్స్‌లోకి అడుగుపెట్టిన నోయల్ టాటా.. అధికారికంగా ప్రకటించిన బోర్డు
Kamala Harris | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతుగా.. తమిళనాడులో ప్రత్యేక పూజలు
US Election | అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. భారతీయ భాషలోనూ బ్యాలెట్ పేపర్