US Election | అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. భారతీయ భాషలోనూ బ్యాలెట్ పేపర్
మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election) ప్రారంభం కానున్నాయి. అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలహారిస్ చరిత్ర సృష్టిస్తారా? మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికై శ్వేతసౌధంలో అడుగిడాలన్న డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఫలిస్తాయా? అనే విషయంపై అమెరికన్లు తీర్పు చెప్పనున్నారు. అయితే ఓటింగ్‌కు ముందు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి.
న్యూయార్క్: మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు (US Election) ప్రారంభం కానున్నాయి. అమెరికా మొదటి మహిళా అధ్యక్షురాలిగా కమలహారిస్ చరిత్ర సృష్టిస్తారా? మరోసారి అధ్యక్షుడిగా ఎన్నికై శ్వేతసౌధంలో అడుగిడాలన్న డొనాల్డ్ ట్రంప్ ఆశలు ఫలిస్తాయా? అనే విషయంపై అమెరికన్లు తీర్పు చెప్పనున్నారు. అయితే ఓటింగ్‌కు ముందు ఆసక్తికర విషయాలు తెలుస్తున్నాయి. ఓటర్లకు సౌలభ్యంగా ఉండేందుకు ఆయా రాష్ట్రాలు వివిధ భాషల్లో బ్యాలెట్లను అందుబాటులో ఉంచుతున్నాయి. ఇందులో భాగంగా 200కుపైగా భాషలు మాట్లాడే న్యూయార్క్‌లో ఇంగ్లిష్‌తోపాటు మరో ఐదు భాషల్లో బ్యాలెట్లను ముంద్రించారు. అందులో ఒక భారతీయ భాష కూడా ఉంది. అదే బెంగాలి. మన జాతీయ భాష అయిన హిందీ కాకుండా బెంగాలీ ఎందుకు అనుకుంటున్నారా.. దానికి ఓ కారణం ఉంది.
అధికంగా మాట్లాడే భారతీయ భాష హిందీనే అయినప్పటికీ, భారత్- బంగ్లాదేశ్ నుంచి వెళ్లి న్యూయార్క్‌లో నివాసముంటున్న బెంగాలీల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. 1965 ఓటింగ్ హక్కుల చట్టం ప్రకారం దక్షిణాసియా మైనారిటీ సమూహాలకు భాషా సహాయం తప్పనిసరని ఫెడరల్ ఆదేశాల నేపథ్యంలో 2013లో క్వీన్స్‌లో బెంగాలీని చేర్చారు.
ఎన్నికల ప్రక్రియలో ఇంగ్లిష్ కాకుండా మరో నాలుగు భాషలకు చోటు కల్పించామని న్యూయార్క్ రాష్ట్ర ఎన్నికల ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మైఖేల్ జే రియాన్ అన్నారు. చైనీస్, స్పానిష్, కొరియన్‌తోపాటు బెంగాలీ భాషల్లో బ్యాలెట్ అందుబాటులో ఉంటుందని చెప్పారు. ఇక్కడ స్థిరపడిన వారికి ఇంగ్లిష్ తెలిసినప్పటికీ మాతృ భాషలో అందుబాటులో ఉండటం ఆయా ప్రాంతాల వారికి సంతోషకరమైన అంశమని తెలిపారు. న్యూయార్క్‌లో నివాసం ఉంటున్న బెంగాలీ వర్గాలకు సేవ చేయడానికి ఇది చక్కటి అవకాశమని పేర్కొన్నారు.
తనలాంటి వారికి ఇంగ్లిష్ తెలుసు. కానీ మా కమ్యూనిటీలో చాలా మంది వారి మాతృభాషతో మరింత సౌకర్యవంతంగా ఉంటారు. ఇది కచ్చితంగా పోలింగ్ కేంద్రంలో ఉపయోగపడుతుంది. బెంగాలీ బ్యాలెట్ చూసి మా నాన్న సంతృప్తిగా ఉంటారనే నమ్మకం ఉంది అని టైమ్స్ స్క్వేర్ సేల్స్ ఏజెంట్, బెంగాలీ అయిన సుభాష్ అన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Laptops | కాలేజీ విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్‌లు.. రూ.2 వేల కోట్లు కేటాయించిన తమిళనాడు ప్రభుత్వం
INDvNZ | భళారే బ్రార్.. న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో గట్టెక్కిన భారత్
Aldas Janaiah | నీతో ఏకాంతంగా గడుపాలి..! అసిస్టెంట్ ప్రొఫెసర్‌కు అగ్రికల్చర్ వర్సిటీ వీసీ అల్దాస్ జానయ్య లైంగిక వేధింపులు
భామనే… సత్యభామనే
TGSRTC | ఆర్టీసీ ‘దీపావళి’ దోపిడీ..! పుణ్యక్షేత్రాలకు వెళ్లే భక్తులనూ దోచుకుంటున్న వైనం
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

