Noel Tata | టాటా గ్రూపు గౌరవ చైర్మన్ రతన్ టాటా (Ratan Tata) వారసుడిగా నోయల్ టాటా (Noel Tata) నియమితులైన విషయం తెలిసిందే. తాజాగా ఆయన టాటా గ్రూప్ హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ బోర్డు (Tata Sons Board)లోకి అధికారికంగా అడుగుపెట్టారు. ఈ విషయాన్ని బోర్డు మంగళవారం అధికారికంగా వెల్లడించింది. టాటా సన్స్ బోర్డులోకి నోయల్ టాటా అధికారికంగా చేరినట్లు వెల్లడించింది.
కాగా, ఉప్పు నుంచి సాఫ్ట్వేర్ వరకు వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన రతన్ టాటా మరణం అనంతరం టాటా ట్రస్ట్ తదుపరి చైర్మన్‌గా నోయెల్ టాటా నియమితులైన విషయం తెలిసిందే. 67 ఏండ్ల వయస్సు కలిగిన నోయల్ టాటా సరైన వ్యక్తి అని టాటా సన్స్ బోర్డు సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. ఇప్పటి వరకూ నోయల్..టాటా గ్రూపునకు చెందిన రిటైల్ బిజినెస్‌ను చూసుకున్నారు. ఇకపై ఆయన టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని ముందుండి నడిపించనున్నారు.
టాటా గ్రూప్‌ను హోల్డింగ్ కంపెనీ టాటా సన్స్ నిర్వహిస్తోంది. అందులో టాటా కుటుంబంతో అనుబంధం ఉన్న ఐదు ట్రస్టులు ఉన్నాయి. ఇందులో కీలకమైనవి రెండు. అది సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్. మరొకటి సర్ రతన్ టాటా ట్రస్ట్. టాటా సన్స్‌లో ఈ రెండింటికి ఎక్కువగా వాటాలున్నాయి. ఈ రెండు ట్రస్టులకు కంపెనీలో దాదాపు 52 శాతం వాటా ఉన్నది. ఐదు ట్రస్ట్‌లకు కలిపి టాటా గ్రూప్ హోల్డింగ్స్ కంపెనీలో మొత్తం 67శాతం వాటా ఉన్నది. రతన్ టాటా చనిపోయే వరకు టాటా గ్రూప్స్ గౌరవ చైర్మన్‌గా కొనసాగారు.
నోయెల్ టాటా.. రతన్ టాటా సవతి తల్లి సిమోన్ టాటా కుమారుడు. ఆయన టాటా గ్రూప్‌తో 40 సంవత్సరాలుగా అనుబంధం ఉన్నది. కంపెనీలోని బోర్డుల్లో వివిధ హోదాల్లో పని చేశారు. ట్రెంట్, టాటా ఫైనాన్షియల్ లిమిటెడ్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్లకు ఆయన చైర్మన్‌గా ఉన్నారు. టాటా స్టీల్ అండ్ టైటాన్ కంపెనీ లిమిటెడ్ వైస్ ప్రెసిడెంట్‌గా.. సర్ రతన్ టాటా ట్రస్ట్, సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ బోర్డుల్లో ట్రస్టీగా ఉన్నారు. టాటా ఇంటర్నేషనల్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆగస్ట్ 2010 నుంచి నవంబర్ 2021 సేవలందించారు. ఆయన పదవీకాలంలో కంపెనీ టర్నోవర్‌ను 500 మిలియన్ డాలర్ల నుంచి 3వేల బిలియన్లకు పెంచారు.
Also Read..
Wikipedia | కచ్చితత్వంలేని సమాచారం.. వికీపీడియాకు కేంద్రం నోటీసులు
AAP MLA | రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తా.. ఆప్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Unstoppable | జ్యోతిక లేకుండా జీవితాన్ని ఊహించుకోలేను.. అన్‌స్టాపబుల్ షోలో సూర్య ఎమోషనల్