AAP MLA | రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తా.. ఆప్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
AAP MLA | డ్రీమ్ గర్ల్, ఎంపీ హేమ మాలినీ (Hema Malini)పై ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే (AAP MLA) నరేష్ బల్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ నగర్ (Uttam Nagar)రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా (Road like Hema Malinis cheeks) చేస్తానంటూ వ్యాఖ్యానించారు.
AAP MLA | డ్రీమ్ గర్ల్, ఎంపీ హేమ మాలినీ (Hema Malini)పై ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే (AAP MLA) నరేష్ బల్యాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్ నగర్ (Uttam Nagar)రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా (Road like Hema Malinis cheeks) చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ‘ఉత్తమ్ నగర్ రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా సన్నగా చేస్తాను’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి.
ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఢిల్లీ బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరిచేలా, స్థానిక సమాజాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు. ఓ మహిళను అగౌరవపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆప్ సుప్రిమో అరవింద్ కేజ్రీవాల్‌ను డిమాండ్ చేశారు. మరోవైపు ఆప్ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కాగా, రాజకీయ నేతలు హేమ మాలినీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో మహారాష్ట్ర మంత్రి ఒకరు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జల్గావ్ జిల్లాలోని తన నియోజకవర్గంలో రోడ్లను ప్రముఖ నటి హేమ మాలినీ బుగ్గలతో పోల్చారు. ఆ రోడ్లను ఎంత బాగా అభివృద్ధి చేశానో విపక్ష నేతలు వచ్చి చూడాలని సవాల్ విసిరారు. అవి హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.
Also Read..
Kumara Swamy | కేంద్ర మంత్రి హెచ్డీ కుమార స్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు
Kamala Harris | అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కమలా హారిస్‌కు మద్దతుగా.. తమిళనాడులో ప్రత్యేక పూజలు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
‘నాంపల్లిని కరువు మండలంగా ప్రకటించాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

