Wikipedia | ప్రముఖ వ్యక్తులు.. చారిత్రక కట్టడాలు.. ప్రముఖ ప్రదేశాలు.. ఇలా ఏ సమాచారం కావాలన్నా ముందుగా గుర్తొచ్చేది వికీపీడియా (Wikipedia). ఈ ఎన్సైక్లోపీడియా (encyclopedia) మనకు కావాల్సిన సమాచారాన్ని అందిస్తోన్న విషయం తెలిసిందే. అయితే, ఈ వికీపీడియాకు కేంద్రం నోటీసులు (Centres Notice) జారీ చేసింది. ఇందులో కచ్చితత్వం లేని సమాచారం ఉంటోందన్న ఫిర్యాదుల మేరకు నోటీసులు పంపింది.
వికీపీడియాలో పక్షపాతంగా సమాచారం ఉంటోందని పలువురు నుంచి ఫిర్యాదులు అందినట్లు కేంద్రం నోటీసుల్లో తెలిపింది. చిన్న సంపాదకులకు, సంస్థలకు కూడా కంటెంట్‌పై ఎడిటోరియల్ నియంత్రణ ఉంటుందని.. వికీపీడియాకు ఆ వ్యవస్థ ఎందుకు లేదని ప్రశ్నించింది. వికీపీడియాను మధ్యవర్తిగా కాకుండా.. పబ్లిషనర్గా ఎందుకు పరిగణించకూడదని ప్రశ్నించింది. కొంతమంది వ్యక్తులతో కూడిన బృందానికి మాత్రమే ఈ పేజీల్లోని సమాచారంపై నియంత్రణ ఉందనే అభిప్రాయం ప్రజల్లో ఉందని పేర్కొంది.
కాగా, ఇటీవలే వికీపీడియా న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటోన్న విషయం తెలిసిందే. ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ఏఎన్ఐ కూడా వికీపీడియాపై కోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు దావా వేసింది. ఈ విషయంలో ఢిల్లీ హైకోర్టు వికీపీడియాపై ఆగ్రహం కూడా వ్యక్తం చేసింది.
Also Read..
AAP MLA | రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తా.. ఆప్ ఎమ్మెల్యే వివాదాస్పద వ్యాఖ్యలు
Kumara Swamy | కేంద్ర మంత్రి హెచ్డీ కుమార స్వామిపై ఎఫ్ఐఆర్ నమోదు