Unstoppable | నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హోస్ట్‌గా చేస్తున్న అన్‌స్టాపబుల్ (Unstoppable) సీజన్ 4 (season 4) విజయవంతంగా రన్ అవుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ టాక్ షోలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో పాటు ‘లక్కీ భాస్కర్’ మూవీ టీమ్ వచ్చి సందడి చేసింది. తాజాగా తమిళ స్టార్ నటుడు సూర్య ఈ షోలో సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ప్రోమో వీడియో తాజాగా విడుదలైంది.
ముందుగా బాలకృష్ణ.. సూర్య నటించిన చిత్రాల్లోని పాటలు పాడుతూ ఆయన్ని వేదికపైకి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బాలకృష్ణ అడిగిన పలు ప్రశ్నలకు సూర్య చాలా సదరాగా సమాధానాలిచ్చారు. అదేవిధంగా తన భార్య జ్యోతిక, తమ్ముడు కార్తి గురించి సూర్య ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. మీ ఫస్ట్ క్రష్ ఎవరని బాలకృష్ణ ప్రశ్నించగా.. ‘వద్దు సర్.. ప్రాబ్లమ్ అవుతుంది. ఇంటికెళ్లాలి’ అంటూ సూర్య సరదాగా సమాధానమిచ్చారు. ఇంతలో బాలకృష్ణ.. కార్తికి లైవ్‌లో ఫోన్ చేసి సూర్య గురించి అడిగారు.
ఈ సందర్భంగా సూర్యకు ఓ హీరోయిన్ అంటే బాగా ఇష్టమని కార్తి చెప్తాడు. దీంతో ‘నువ్వు కత్తిరా.. కార్తి కాదు’ అంటూ సూర్య అంటారు. ఇక జ్యోతిక గురించి మాట్లాడుతూ.. ‘తను లేకుండా నా జీవితాన్ని ఊహించుకోలేను’ అంటూ సూర్య కాస్త ఎమోషనల్ అవుతారు. వీరిద్దరి మధ్య సాగిన సరదా సంభాషణ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. సూర్యకు సంబంధించిన ఫుల్ ఎపిసోడ్ నవంబర్ 8న ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. అప్పటి వరకూ ఈ ప్రోమోను చూసి ఎంజాయ్ చేయండి.
Simham, Samarasimham kalisina vela,
undadha entertainment sky level lona 🔥#UnstoppableWithNBK Season 4, Episode 3 premieres on Nov 8.#UnstoppableS4 #NandamuriBalakrishna @Suriya_offl @thedeol #AhaVideoIN #AhaOriginalSeries #NBK #kanguva pic.twitter.com/sepYn3G1Pi— ahavideoin (@ahavideoIN) November 5, 2024
Also Read..
Samantha | బరువు పెరగండి అంటూ నెటిజన్ కామెంట్.. సీరియస్ అయిన సమంత
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్