Samantha | టాలీవుడ్ స్టార్ నటి సమంత (Samantha) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. తన అందం, అభినయంతోపాటు నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకుంది. అనారోగ్య సమస్యల కారణంగా ఏడాదికాలంగా సినిమాలకు బ్రేక్ తీసుకున్న సామ్.. ప్రస్తుతం మళ్లీ ప్రొఫెషనల్ లైఫ్‌లో బిజీ అవుతోంది. తాను నటించిన ‘సిటాడెల్: హనీ బన్నీ’ (Citadel: Honey Bunny) సిరీస్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమైంది. ఈ సిరీస్ ప్రొమోషన్స్లో పాల్గొంటోంది.
ఇందులో భాగంగా సోమవారం తన ఇన్‌స్టా వేదికగా ఆస్క్ మీ ఎనీ థింగ్ సెషన్ నిర్వహించింది. అభిమానులతో సరదాగా కాసేపు ముచ్చటించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చింది. ఈ క్రమంలో ఓ నెటిజన్ సమంతను ఆసక్తికర ప్రశ్న వేశారు. కాస్త బరువు పెరగాలని (Gain Weight) విజ్ఞప్తి చేశారు. ‘ప్లీజ్ మేడం, కాస్త బరువు పెరగండి’ అంటూ నమస్కరిస్తున్న ఎమోజీతో కామెంట్ పెట్టారు. సదరు అభిమాని రిక్వెస్ట్‌పై సమంత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది.
‘మళ్ళీ బరువు గురించే ప్రశ్న. మయోసైటిస్ కారణంగా వైద్యుల సూచనల మేరకు ప్రస్తుతం నేను చాలా స్ట్రిక్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్లో ఉన్నాను. అందువల్లే నా బరువు ఇలా ఉంది. నా ఆరోగ్య పరిస్థితుల వల్ల నేను ఇలానే ఉండాలి. ఇతరులను జడ్డ్ చేయడం ఆపండి. మనం 2024లో ఉన్నాం. దయచేసిన అవతలి వాళ్లను కూడా బతకనివ్వండి’ అంటూ గట్టిగా సమాధానం ఇచ్చింది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
సమంత ప్రధాన పాత్రల్లో నటిస్తున్న స్పై యాక్షన్ సిరీస్ ‘ ‘సిటాడెల్: హనీ బన్నీ’(Citadel: Honey Bunny). ఇందులో వరుణ్ ధావన్ కథానాయకుడిగా నటిస్తుండగా.. ‘ది ఫ్యామిలీ మ్యాన్’, ‘ఫర్జీ’ లాంటి విజయవంతమైన సిరీస్‌లను అందించిన రాజ్ అండ్ డీకే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక చోప్రా నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ వెబ్ సిరీస్ ‘సిటాడెల్’కు రీమేక్‌గా ఈ సిరీస్ రాబోతుంది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఇక విడుదల తేదీ దగ్గరపడటంతో వరుస ప్రమోషన్స్ చేస్తుంది చిత్రబృందం. ఈ సిరీస్‌లో కే కే మీనన్, సిమ్రాన్, సాకిబ్ సలీమ్, సికందర్ ఖేర్, సోహమ్ మజుందార్, శివన్‌కిత్ పరిహార్ మరియు కష్వీ మజ్ముందర్ తదితరులు ఇందులో కీలక పాత్రల్లో నటించారు.
Also Read..
Salman Khan | రూ.5 కోట్లు ఇవ్వాలి లేదంటే.. సల్మాన్‌ను చంపేస్తాం
Devara | దేవర వచ్చేస్తున్నాడు.. ఓటీటీ ప్లాట్‌ఫాంలో తారక్ మూవీ స్ట్రీమింగ్ టైం ఫిక్స్
Vijay Devarakonda | వీడీ 12 షూటింగ్లో రౌడీ హీరో విజయ్‌కి గాయాలు..!