Salman Khan | రూ.5 కోట్లు ఇవ్వాలి లేదంటే.. సల్మాన్‌ను చంపేస్తాం
Salman Khan | గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Larence Bishnoi gang) నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు తాజాగా మరోసారి బెదిరింపులు (fresh threat) వచ్చాయి.
Salman Khan | గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ (Larence Bishnoi gang) నుంచి బాలీవుడ్ స్టార్ నటుడు సల్మాన్ ఖాన్ (Salman Khan)కు తాజాగా మరోసారి బెదిరింపులు (fresh threat) వచ్చాయి. కృష్ణ జింకను చంపినందుకు గానూ సల్మాన్ ఆలయాన్ని సందర్శించి క్షమాపణలు చెప్పాలని (forgiveness at temple).. లేదంటే రూ.5 కోట్లు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడిగా చెప్పుకునే వ్యక్తి నుంచి ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్‌కు సోమవారం ఈ సందేశం వచ్చినట్లు పోలీసులు తాజాగా వెల్లడించారు.
‘సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే గుడికి వెళ్లి క్షమాపణ చెప్పాలి. లేదా రూ. 5 కోట్లు చెల్లించాలి. అలా చేయకపోతే మేము అతన్ని చంపేస్తాం. మా గ్యాంగ్ యాక్టివ్‌గా ఉంది’ అని బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపు మెసేజ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.
కాగా, సల్మాన్ ఖాన్‌కు ఇటీవలే వరుస హత్య బెదిరింపులు వస్తున్న విషయం తెలిసిందే. ప్రాణాలతో ఉండాలన్నా, బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ముంబై ట్రాఫిక్ పోలీసుల వాట్సప్ నంబర్‌కు అక్టోబర్ 17 రాత్రి మెసేజ్ చేశారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ నంబర్ ఎవరిది, మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందని కనుక్కొనే పనిలో పడ్డారు. ఈ కేసులో జంషెడ్‌పూర్‌కు 24 ఏళ్ల కూరగాయల అమ్మకందారుడు షేక్ హుస్సేన్ షేక్ మౌసిన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత గత శుక్రవారం కూడా సల్మాన్‌కు ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. బెదిరింపులకు పాల్పడింది నోయిడాకు చెందిన 20 ఏళ్ల వ్యక్తి మహ్మద్ తయ్యబ్‌గా గుర్తించిన పోలీసులు అతడి అరెస్ట్ చేశారు.
ఆ తర్వాత గత నెల 30వ తేదీన కూడా మరోసారి ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. రూ. రెండు కోట్లు ఇవ్వాలని, లేదంటే చంపేస్తామని ఆయన్ను బెదిరించారు. గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఆ మెసేజ్ వచ్చింది. ముంబై ట్రాఫిక్ పోలీసులకు ఆ మెసేజ్ వచ్చినట్లు తెలుస్తోంది. ఒకవేళ డబ్బులు చెల్లించకుంటే, అతన్ని చంపేస్తామని ఆ మెసేజ్‌లో వార్నింగ్ ఇచ్చారు. ముంబైలోని వర్లీ పోలీసులు.. గుర్తు తెలియని వ్యక్తిపై కేసు బుక్ చేసి విచారణ చేపట్టారు. వరుస బెదిరింపుల నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం సల్మాన్‌కు భద్రతను పెంచింది.
Also Read..
US Election | అమెరికా అధ్యక్ష ఎన్నికలు.. భారతీయ భాషలోనూ బ్యాలెట్ పేపర్
Khalistan | ఖలిస్థానీ ఆందోళనల్లో పాల్గొన్న పోలీస్ అధికారి.. సస్పెన్షన్ వేటు
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

