బుధవారం 27 జనవరి 2021
National - Nov 26, 2020 , 15:20:03

పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు

పూంచ్‌ సెక్టార్‌లో పాక్‌ కాల్పులు

శ్రీనగర్‌ : జమ్మూ కాశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలోని కస్బా, కిర్ని ప్రాంతాల్లో నియంత్రణ రేఖ (ఎల్‌ఓసీ) వెంట పాకిస్తాన్ గురువారం కాల్పుల విరమణను ఉల్లంఘించింది. చిన్న ఆయుధాలతో కాల్పులు జరుపడంతో పాటు మోర్టార్లతో తీవ్రంగా దాడి చేసిందని అధికారులు తెలిపారు. వారికి భారతసైన్యం సరైన సమాధానం ఇచ్చింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. జిల్లాలోని దేగ్వార్, మాల్టి, డల్లాన్ ప్రాంతాల్లోని పూంచ్‌లో నాలుగు రోజుల క్రితం దాయాది కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.


logo