Pak national | ఆపరేషన్ సిందూర్ వేళ పంజాబ్ (Punjab) రాష్ట్రంలోని పాక్ సరిహద్దుల వద్ద కలకలం రేపింది. పాక్ జాతీయుడు (Pak national) భారత్‌లోకి ప్రవేశించేందుకు యత్నించాడు. వెంటనే అప్రమత్తమైన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (Border Security Force) కాల్పులు జరిపింది. ఈ కాల్పుల్లో సదరు వ్యక్తి మరణించాడు.
బుధవారం అర్ధరాత్రి సమయంలో పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ సెక్టార్ (Ferozepur sector) లో పాకిస్థాన్ జాతీయుడు భారత్‌లోకి చొరబడేందుకు యత్నించాడు. చీకట్లో భారత భూభాగంవైపు దూసుకొచ్చాడు. గమనించి బీఎస్ఎఫ్ బలగాలు వెంటనే అతడిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో పాక్ వ్యక్తి హతమయ్యాడు. అనంతరం అతడి మృతదేహాన్ని పోలీసులకు అప్పగించారు.
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్‌లోని ఉగ్రస్థావరాలపై విరుచుకుపడింది. ఈ దాడిలో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు ప్రభుత్వం ప్రకటించింది.
భారత్ దాడితో రగిలిపోతున్న పాక్.. ప్రతిచర్యగా భారత్‌పై ఏక్షణమైనా దాడులు చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. సరిహద్దు రాష్ట్రాల్లో భద్రతను కట్టుదిట్టం చేసింది. ముఖ్యంగా రాజస్థాన్ (Rajasthan), పంజాబ్ (Punjab) రాష్ట్రాల్లో హై అలర్ట్ ప్రకటించింది. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పోలీసు సిబ్బంది సెలవులను రద్దు చేశాయి. అంతేకాదు బహిరంగ సభలపై కూడా నిషేధం విధించాయి. పాక్‌తో రెండు రాష్ట్రాల సరిహద్దులను పూర్తిగా మూసివేశారు. సరిహద్దు వద్ద ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే కాల్పులు జరిపేలా భద్రతా దళాలకు ఆదేశాలు జారీ అయ్యాయి.
Also Read..
100 Terrorists Killed | ఆపరేషన్ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం : రాజ్‌నాథ్ సింగ్
Fact Check | ‘ఫేక్ యుద్ధాని’కి తెరలేపిన పాక్.. ‘ఫ్యాక్ట్ చెక్’తో చెక్ పెట్టిన భారత్
Operation Sindoor | రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్.. పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు