Fact Check | పెహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor)తో పాక్‌కు గట్టి బదులిచ్చింది. ఈ దాడితో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. దిక్కుతోచని స్థితిలో భారత్‌పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తోంది. ఈ క్రమంలో ‘ఫేక్ యుద్ధానికి’ తెరలేపింది. సోషల్ మీడియా వేదికగా ఫేక్ ప్రచారం మొదలు పెట్టింది. ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్‌పై తమ సైన్యం దాడులు చేసినట్లు (Pakistan strikes) సోషల్ మీడియా వేదికగా తప్పుడు వార్తలను ప్రచారం చేస్తోంది. భారత్‌లోని ఐదు నగరాలపై దాడులు చేసినట్లు చెప్పుకుంటోంది.
ఇందుకు సాక్ష్యంగా పాత ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసి భారత్‌పై దుష్ప్రచారం చేస్తోంది. అంతేకాదు అమృత్‌సర్‌లోని మిలిటరీ బేస్‌పై (Amritsar Military Base) మిస్సైళ్ల దాడి చేసినట్లు కూడా చెప్పుకుంటోంది. అయితే, పాక్ ఫేక్ ప్రచారాన్ని భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతోంది. ఫ్యాక్ట్ చెక్ (Fact Check)తో పాక్ తప్పుడు వార్తలకు చెక్ పెట్టి దాయాది దేశానికి గట్టి బదులిస్తోంది. పీఐబీ ఫ్యాక్ట్‌చెక్‌తో ఆధారలతో సహా పాక్ తప్పుడు ప్రచారాన్ని బయటపెట్టింది.
⚠️Pakistan Propaganda Alert!
Pakistan-based handles are spreading old videos falsely alleging strikes on a military base in Amritsar. #PIBFactCheck
✔️The video being shared is from a wildfire from 2024
✅ Avoid sharing unverified information and rely only on official… pic.twitter.com/1FdtfXUqEY
— PIB Fact Check (@PIBFactCheck) May 8, 2025
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది.
‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో 80 మందికిపైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు తెలిసింది. అంతేకాదు, భారత్ దాడితో జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం మొత్తం హతమైంది. ఆయన ఫ్యామిలీలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు నలుగురు సహాయకులు, సన్నిహితులు కూడా మరణించినట్లు తెలిసింది. భారత్ దాడితో పాక్ ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
Also Read..
NIA | ఉగ్రఘటన సమాచారం ఉంటే మాతో పంచుకోండి.. స్థానికులను కోరిన ఎన్ఐఏ
Operation Sindoor | రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్.. పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు