All Party Meeting | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) చేపట్టి భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్రస్థావరాలపై మిస్సైల్స్‌తో కురిపించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలు సహా తొమ్మిది ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశానికి (all party meeting) పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ (Rajnath Singh) అధ్యక్షతన అన్ని పార్టీల నేతలు సమావేశం అయ్యారు.
ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు అమిత్ షా, జేపీ నడ్డా, నిర్మలా సీతారామణ్, జై శంకర్, కిరణ్ రిజిజు సహా పలువురు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, వివిధ రాజకీయ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో పాక్‌పై భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ వివరాలను రక్షణ మంత్రి పంచుకుంటున్నారు.
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ జరిపిన ఈ దాడిలో 80 మంది వరకూ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి.
#WATCH | Centre holds all-party meeting to brief all political parties on #OperationSindoor pic.twitter.com/q96NZnhUY6
— ANI (@ANI) May 8, 2025
Also Read..
Ajit Doval | ఆపరేషన్ సిందూర్ తర్వాత.. ప్రధాని మోదీతో అజిత్ ధోవల్ భేటీ
Ceasefire | నియంత్రణరేఖ వద్ద పాక్ దుశ్చర్య.. జవాను సహా 13 మంది మృతి
Operation Sindoor | రాజస్థాన్, పంజాబ్ రాష్ట్రాల్లో హై అలర్ట్.. పోలీసు సిబ్బందికి సెలవులు రద్దు