Ajit Doval | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) తో జాతీయ భద్రతా సలహాదారు (National Security Advisor) అజిత్ ధోవల్ (Ajit Doval) సమావేశమయ్యారు. గురువారం ఉదయం మోదీ నివాసానికి వెళ్లిన ధోవల్ ప్రధానితో కాసేపు భేటీ అయ్యారు. ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాక్‌పై దాడుల తర్వాత మోదీతో ధోవల్ భేటీ కావడం ఇదే తొలిసారి. అంతేకాదు మరికాసేపట్లో అఖిలపక్ష సమావేశం జరుగుతున్న నేపథ్యంలో వీరి భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఆపరేషన్ సిందూర్ తర్వాత పరిస్థితులు, సరిహద్దుల్లో ఉద్రిక్తతల గురించి మోదీకి ఆయన వివరించినట్లు తెలుస్తోంది.
జమ్ము కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ ప్రతీకారం తీర్చుకున్నది. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) పేరుతో ప్రతిదాడికి దిగి పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే)తోపాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్, లష్కరే తాయిబా, హిజ్బుల్ ముజాహిదీన్లకు చెందిన 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసింది. భారత్ జరిపిన ఈ దాడిలో 80 మంది వరకూ ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయినట్లు వార్తలు వచ్చాయి.
ఆపరేషన్ సిందూర్ చేపట్టి భారత సైన్యం కేవలం 25 నిమిషాల్లోనే తొమ్మిది ఉగ్రస్థావరాలపై మిస్సైల్స్‌తో కురిపించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ప్రధాన కార్యాలయాలు సహా తొమ్మిది ఉగ్రవాద శిక్షణా కేంద్రాలను నేలమట్టం చేసింది. ఈ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేణానికి పిలుపునిచ్చింది. ఉదయం 11 గంటలకు అన్ని పార్టీల నేతలతో కేంద్ర మంత్రులు సమావేశం కానున్నారు.
Also Read..
Operation Sindoor | పాక్‌తో రాజస్థాన్, పంజాబ్ సరిహద్దులు బంద్.. సిద్ధంగా క్షిపణులు
Ceasefire | నియంత్రణరేఖ వద్ద పాక్ దుశ్చర్య.. జవాను సహా 13 మంది మృతి
Chopper Crashes | ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం.. హెలికాప్టర్ కూలి ఐదుగురు మృతి