Chopper Crashes | ఉత్తరాఖండ్ (Uttarakhand)లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. హెలికాప్టర్ కూలి (Chopper Crashes) ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ ఘటన ఉత్తర కాశీ జిల్లాలో గురువారం ఉదయం 9 గంటల సమయంలో చోటు చేసుకుంది.
కొందరు పర్యాటకులతో గంగోత్రికి వెళ్తున్న హెలికాప్టర్ భగీరథి నది (Bhagirathi River) సమీపంలో కుప్పకూలిపోయింది. ప్రమాద సమయంలో అందులో ఏడుగురు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు గాయాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, రెస్క్యూ బృందాలు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
Also Read..
landmine Explode | ములుగు జిల్లాలో పేలిన మందుపాతర.. ముగ్గురు పోలీసులు మృతి..!
Ceasefire | సరిహద్దుల్లో పాక్ సైన్యం దుశ్చర్య.. కాల్పులను తిప్పికొట్టిన భారత సైన్యం..
Vatican City | సిస్టైన్ చాపెల్ తలుపులు మూసివేత.. మొదలైన మొదలైన కొత్త పోప్ ఎన్నిక..!