landmine Explode | ములుగు జిల్లాలో పేలిన మందుపాతర.. ముగ్గురు పోలీసులు మృతి..!
landmine Explode | ములుగు జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. వెంకటాపురం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు మృతి చెందినట్లు సమాచారం.
landmine Explode | ములుగు జిల్లాలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. వెంకటాపురం మండలం సరిహద్దు అటవీ ప్రాంతంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకున్నది. ఈ ఘటనలో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం. ఆపరేషన్ కర్రెగుట్ట పేరుతో తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని అటవీ ప్రాంతాన్ని జల్లెడపడుతూ తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం రోజువారీ కూంబింగ్ కోసం వెళ్లిన సమయంలో మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతర పేలడంతో ముగ్గురు పోలీసులు మృతి చెందినట్లు సమాచారం. గత 17రోజులుగా బలగాల ‘ఆపరేషన్ కర్రెగుట్ట’ పేరుతో.. 90 కిలోమీటర్ల విస్తరించి ఉన్న అటవీ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకునేందుకు భద్రతా బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి.
అటవీ ప్రాంతంలో సీఆర్పీఎఫ్ జవాన్లు, పోలీసులు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరుగుతూ వస్తున్నాయి. ఈ మావోయిస్టులు తమ ఉనికిని కాపాడుకునేందుకు ఏర్పాటు చేసిన 200 మందుపాతరలను బలగాలు ఇప్పటి వరకు నిర్వీర్యం చేశారు. తెలంగాణ సరిహద్దు ములుగు జిల్లా వెంకటాపురం, వాజేడు, చర్ల ప్రాంతాలను సరిహద్దులుగా చేసుకొని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన మందుపాతరలను బలగాలు గుర్తించి.. తొలగించాయి. ప్రస్తుతం ఆపరేషన్ కర్రెగుట్టలో దాదాపు 24వేల మంది భద్రతా బలగాలు పాల్గొంటున్నాయి. ఇప్పటి వరకు రెండు ఎన్కౌంటర్లో 25 మంది మావోయిస్టులు మృతి చెందగా.. పలువురు జవాన్లు గాయపడ్డారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. ఇప్పటి వరకు పోలీసులు ఈ విషయంపై అధికారికంగా స్పందించలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు
Global Telangana Association | గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాషింగ్టన్ డీసీలో బతుకమ్మ, దసరా వేడుకలు
attack on bus | జమ్ముకశ్మీర్ బస్సుపై రాళ్లతో దాడి.. డ్రైవర్‌ను ఉగ్రవాదిగా పేర్కొన్న వ్యక్తులు
BRS Leaders | కష్ట కాలంలో అండగా బీఆర్ఎస్.. అధినాయకులపై ప్రత్యేక అభిమానం చాటుకుంటున్న రవీందర్
Stock Markets | భారీ నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్ మార్కెట్లు.. ఇన్వెస్టర్స్ సంపద రూ.4 లక్షల కోట్లు ఆవిరి..!
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

