హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులకు ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రమాద బీమా, లోన్ బీమా పథకాలు ఆర్థిక రక్షణ కవచంలా నిలుస్తున్నాయని మంత్రి సీతక్క తెలిపారు. ఇప్పటి వరకు ప్రమాద బీమా, రుణ బీమా కోసం రూ.246 కోట్లు చెల్లించామన్నారు. అనుకోకుండా ఏదైనా జరిగితే స్వయం సహాయక సభ్యుల కుటుంబాలపై భారం పడకుండా ఉండటానికే ఈ చర్యలు తీసుకున్నామని వెల్లడించారు.