 
                                                            PM Modi | ‘ఆపరేషన్ సిందూర్’ (Operation Sindoor) ద్వారా భారత్ బలాన్ని (Indias strength) ప్రపంచం మొత్తం చూసిందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) అన్నారు. మన దేశం నిజమైన బలం ఏంటో శత్రుదేశానికి తెలిసిందన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, భారతదేశ తొలి ఉప ప్రధాని, ఉక్కు మనిషి సర్దార్ వల్లబాయి పటేల్ (Sardar Vallabhbhai Patel) 150వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్ద ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పటేల్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు. ‘ఆపరేషన్ సిందూర్’ అంశాన్ని ప్రస్తావించారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత్ తన శత్రుదేశ భూభాగంలోకి ప్రవేశించి దాడి చేయగలదన్న స్పష్టమైన సందేశాన్ని ప్రపంచానికి పంపిందన్నారు. ‘ఎవరైనా మనదేశం వైపు కన్నెత్తి చూసే సాహసం చేస్తే.. భారత్ వారి భూభాగంలోకి చొరబడి మరీ దెబ్బకొడుతుందని ఆపరేషన్ సిందూర్‌తో ప్రపంచమంతా చూసింది. మన దేశం నిజమైన బలం ఏంటో పాక్, ఆ ఉగ్రవాదులకు తెలిసింది’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. దేశ భద్రత విషయంలో తమ ప్రభుత్వ దృఢ వైఖరి సర్దార్ పటేల్ ఆశయాలకు అనుగుణంగానే ఉందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ పటేల్ ఆశయాలను పూర్తిగా మరిచిపోయిందని ఆరోపించారు.
Also Read..
NDA Manifesto | కోటి ప్రభుత్వ ఉద్యోగాలు.. బీహార్ ఎన్నికల కోసం ఎన్డీయే మేనిఫెస్టో
Indians | ఈ ఏడాది 2,790 మంది భారతీయుల్ని వెళ్లగొట్టిన అమెరికా : కేంద్రం
Financial Changes | ఆధార్ టు బ్యాంక్ రూల్స్.. నవంబర్ 1 నుంచి అమల్లోకి కీలక మార్పులు
 
                            