Parliament Session | వారం రోజుల అవాంతరాలు, ప్రతిష్టంభన అనంతరం సోమవారం నుంచి వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు (Parliament Monsoon Session) వాడీవేడిగా జరగనున్నాయి. పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor)పై నేడు లోక్‌సభలో చర్చ జరగనుంది. మధ్యాహ్నం 12 గంటలకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పహల్గాం ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ తదితర పరిణామాలపై మాట్లాడనున్నారు. ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు 16 గంటల చొప్పున ఉభయ సభలకు సమయం కేటాయించిన విషయం తెలిసిందే. సోమవారం లోక్‌సభ, మంగళవారం రాజ్యసభలో ప్రత్యేక చర్చ ప్రారంభం కానున్నది. సుదీర్ఘ చర్చ అనంతరం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సమాధానమివ్వనున్నారు.
Monsoon session of Parliament | Defence Minister Rajnath Singh will address the Lok Sabha at around 12 pm today pic.twitter.com/h95Ddi6TbT
— ANI (@ANI) July 28, 2025
మరోవైపు ఆయా అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ప్రతిపక్షాలు సిద్ధమయ్యాయి. భారత్, పాకిస్థాన్ మధ్య అణుయుద్ధం జరగకుండా కాల్పుల విరమణకు ఒప్పించానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి అ అవకాశాన్ని వినియోగించుకోనున్నాయి. దీంతో లోక్‌సభలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధాన్ని సృష్టించే అవకాశం ఉంది. వర్షాకాల పార్లమెంట్ సమావేశాలు మొదటివారం ప్రతిపక్షాలు సృష్టించిన రభస కారణంగా వాయిదాల పర్వం కొనసాగిన విషయం తెలిసిందే.
Also Read..
Electric Shock | తెగిపడిన విద్యుత్ వైర్లు.. మహాదేవ్ ఆలయంలో కరెంట్ షాక్‌తో ఇద్దరు భక్తులు మృతి
టీసీఎస్‌లో 12 వేలకు పైగా ఉద్యోగాల కోత..
మహిళల ఆర్థికాభివృద్ధి పథకంలో పురుష లబ్ధిదారులు.. మహారాష్ట్రలో లడ్కీ బెహన్ స్కామ్