లక్నో: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ మానసాదేవి ఆలయంలో తొక్కిసలాట (Stampede) మరువక ముందే ఉత్తరప్రదేశ్‌లోని బారాబంకీలో మరో ఘటన చోటుచేసుకున్నది. యూపీలోని బారాబంకీ జిల్లా హైదర్ఘర్లో ఉన్న అవ్సనేశ్వర్ మహాదేవ్ ఆలయంలో స్వల్ప తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరు భక్తులు మృతిచెందారు. ఈ ఘటన సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు జరిగింది. శ్రావణ మాసంలో మూడో సోమవారం కాడంతో ఆలయానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. మహాదేవుడికి జలాభిషేకం చేయడానికి తమ వంతుకోసం వేచిఉన్నారు. ఈ క్రమంలో కరెంటు వైర్లు తెగిపడంతో పలువురికి విద్యుత్ షాక్ (Electric Shock) తగిలింది. దీంతో భయాందోళనలకు గురైన భక్తులు పరుగులు పెట్టారు. ఈ క్రమంలో స్వల్ప తొక్కిసలాట చోటుచేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
స్థానికులు వారిని సమీపంలోని దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ 22 ఏండ్ల యువకుడు సహా మరో వ్యక్తి మృతిచెందారు. దైవ దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారని, అయితే విద్యుత్ తీగలపై కోతులు దూకులాడటంతో అవి తెగిపడ్డాయని జిల్లా కలెక్టర్ శషాంక్ త్రిపాఠి తెలిపారు. దీంతో పలువురు కింద పడిపోయారని చెప్పారు. సుమారు 19 మంది విద్యుత్ షాక్‌కు గురయ్యారన్నారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని వెల్లడించారు.
హరిద్వార్ ఆలయంలో తొక్కిసలాట.. ఆరుగురు భక్తులు మృతి
భార్య గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు చోరీలు
పిల్లలను చంపి తిన్న ప్రాచీన మానవులు..
మహిళల ఆర్థికాభివృద్ధి పథకంలో పురుష లబ్ధిదారులు.. మహారాష్ట్రలో లడ్కీ బెహన్ స్కామ్