Onion Price | దేశంలో ఉల్లి ఘాటు మరింత (Onion Price) పెరిగింది. నిన్న మొన్నటి వరకు హోల్సేల్ మార్కెట్లలో రూ.40-60 పలికిన కిలో ఉల్లి ధర.. ఇప్పుడు ఏకంగా రూ.70-80కి చేరింది. దిగుబడి తగ్గడమే ధరల పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీ (Delhi), ఆర్థిక రాజధాని ముంబై (Mumbai) నగరాల్లో కిలో ఉల్లి ధర రూ.80గా ఉంది. దేశంలోని ఇతర నగరాల్లో కూడా ఉల్లి ధరలు ఇదేవిధంగా కొనసాగుతున్నాయి. ఉల్లితో పాటు ఇతర కూరగాయల ధరలు కూడా ప్రస్తుతం ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్య ప్రజలు ఇంట్లో వంట వండుకోలేని పరిస్థితి. చాలీచాలని జీతాలకు తోడు పెరుగుతున్న నిత్యావసర ధరలు మరింత భారంగా మారాయని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు పెరగడంతో ఆహారపు అలవాట్లపై ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నారు. ఉల్లితోపాటు వెల్లుల్లి ధర కూడా రెట్టింపు కావడంతో కుటుంబ బడ్జెట్ను దెబ్బతీస్తున్నదని కొనుగోలుదారులు వాపోతున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకొని కూరగాయల (vegetables) ధరలను తగ్గేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read..
Justice Sanjiv Khanna | సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్ సంజీవ్ ఖన్నా
Room Rent | రెంట్ కట్టలేదని.. యువతిపై కత్తితో దాడిచేసిన ఇంటి ఓనర్