Jamili Elections | దేశంలో జమిలి ఎన్నికల (Jamili Elections) నిర్వహణకు సంబంధించి రూపొందించిన రెండు కీలక బిల్లులకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. ఈ ముసాయిదా బిల్లులు ఈనెల 16వ తేదీన లోక్సభ (Lok Sabha) ముందుకు రానున్నట్లు తెలిసింది. ఈ మేరకు అధికారిక వర్గాలను ఊటంకిస్తూ జాతీయ మీడియా పేర్కొంది.
డిసెంబర్ 16న ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లు’ (One Nation One Election bill)ను లోక్సభలో ప్రవేశపెట్టనున్నట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ (Arjun Ram Meghwal) 129వ రాజ్యాంగ సవరణ బిల్లు కింద జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించాయి. ఆ తర్వాత దీనిని చర్చ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (Joint Parliamentary Committee)కి పంపనున్నారు.
దేశవ్యాప్తంగా అన్ని రాష్ర్టాల అసెంబ్లీలకు, లోక్సభకు, స్థానిక సంస్థలకు ఒకేసారి ఎన్నికలను నిర్వహించడమే జమిలి ఎన్నికల ప్రధాన ఉద్దేశం. వాస్తవానికి మన దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ కొత్తదేమీ కాదు. 1952లో తొలి సాధారణ ఎన్నికలు మొదలుకొని, 1967 వరకు లోక్సభకు, రాష్ర్టాల అసెంబ్లీలకు చాలావరకు ఒకేసారి ఎన్నికలు జరిగాయి. అయితే అనంతర కాలంలో సుస్థిర ప్రభుత్వాలు ఏర్పడకపోవడం, గడువుకు ముందే పలు రాష్ర్టాల శాసనసభలను బర్తరఫ్ చేయడం తదితర కారణాలతో జమిలి ఎన్నికలు పట్టాలు తప్పాయి. దీంతో లోక్సభ, అసెంబ్లీలకు వేర్వేరుగా ఎన్నికలు జరుపడం మొదలైంది.
జమిలి నిర్వహణ ఇలా.. (కోవింద్ కమిటీ సిఫారసులు)
Also Read..
“అంబేద్కర్ను విస్మరించిన జమిలి!”