Viral Video | ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) రాయ్‌బరేలీ (Rae Bareli)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ ఎస్యూవీ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంగా వెళ్తూ ఎదురుగా వస్తున్న బైక్ (SUV Rams Bikers), ఓ పాదచారిని బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. బైక్‌పై ఉన్న ఇద్దరు వ్యక్తులు అమాంతం గాల్లో ఎగిరి రోడ్డుపై పడ్డారు. ఇందుకు సంబంధించిన షాకింగ్ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఈ ఘటన లక్నో – ప్రయాగ్‌రాజ్ జాతీయ రహదారిపై ఉంచహర్ మార్కెట్ (Unchahar market) ప్రాంతంలో ఆదివారం జరిగింది. పూలతో డెకొరేట్ చేసిన పెళ్లి కారు అటుగా వెళ్తోంది. అదే సమయంలో ఎదురుగా ఇద్దరు వ్యక్తులు బైక్‌పై వస్తున్నారు. అతివేగంగా వెళ్తున్న కారు డ్రైవర్ వాహనంపై నియంత్రణకోల్పోయి ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీ కొట్టాడు. దీంతో వారు గాల్లోకి ఎగిరి రోడ్డుపై పడ్డారు. బాధితులు కందరవకు చెందిన సూర్య, గురు శరణ్‌గా గుర్తించారు. ఈ ఘటనలో ఇద్దరికీ గాయాలైనట్లు తెలుస్తోంది.
A car hit the bike riders and threw them in the air, Raebareilly UP
https://t.co/5ZtHgs62Oy— Ghar Ke Kalesh (@gharkekalesh) March 3, 2025
ప్రమాదం అనంతరం డ్రైవర్ కారును ఆపకుండా అలాగే వేగంగా దూసుకెళ్లాడు. ఈ క్రమంలో కాస్త ముందుకు వెళ్లిన తర్వాత హనుమాన్ దేవాలయం సమీపంలో రోడ్డుపై నడుస్తున్న మహ్మద్ కలీమ్‌ను ఢీ కొట్టాడు. అప్రమత్తమైన స్థానికులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అదేవిధంగా వరుస ప్రమాదాలకు కారణమైన కారు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Also Read..
Train | రెండుగా విడిపోయిన రైలు.. ఆందోళనలో ప్రయాణికులు
PM Modi | వంతారాలో సింహం పిల్లలతో మోదీ.. వీడియో
Indian Student | ఇంకా కోమాలోనే భారత విద్యార్థిని.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన కుటుంబం