PM Modi | గాయపడిన, ఇబ్బందుల్లో ఉన్న జంతువులను సంరక్షించే లక్ష్యంతో ‘వంతారా’ (Vantara) కార్యక్రమాన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ ఫౌండేషన్ డైరెక్టర్ అనంత్ అంబానీ ప్రారంభించిన విషయం తెలిసిందే. వన్యప్రాణుల రక్షణ, పునరావాసం, సంరక్షణ కేంద్రమైన ఈ వంతారాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) మంగళవారం సందర్శించారు. ప్రధాని మోదీ ప్రస్తుతం తన సొంత రాష్ట్రం గుజరాత్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. సోమవారం ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం (World Wildlife Day) సందర్భంగా గిర్ అడవుల్లో సఫారీకి వెళ్లారు.
ఇవాళ జామ్‌నగర్ (Jamnagar)లోని వంతారాను సందర్శించారు. వన్యప్రాణుల ఆసుపత్రిని, జంతువుల కోసం ఏర్పాటు చేసిన MRI, CT స్కాన్లు, ICUలు మొదలైన వాటితో కూడిన పశువైద్య సౌకర్యాలను వీక్షించారు. అంతే కాకుండా వైల్డ్‌లైఫ్ అనస్థీషియా, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఎండోస్కోపీ, డెంటిస్ట్రీ, ఇంటర్నల్ మెడిసిన్ మొదలైన అనేక విభాగాలను కూడా పరిశీలించారు. వంతారాలో పునరావాసం పొందుతున్న వివిధ జాతుల జంతువులతో ప్రధాని సన్నిహితంగా మెలిగారు. అక్కడ సింహాల పిల్లలకు (lion cubs), జిరాఫీలకు ఆహారం అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
#WATCH | PM Narendra Modi inaugurated and visited the wildlife rescue, rehabilitation, and conservation centre, Vantara in Gujarat. Vantara is home to more than 2,000 species and over 1.5 lakh rescued, endangered, and threatened animals. PM explored various facilities at the… pic.twitter.com/itbMedPtD3
— ANI (@ANI) March 4, 2025
దేశ, విదేశాల్లో గాయపడిన, ప్రమాదంలో చిక్కుకున్న జంతువులను కాపాడి, చికిత్స చేసి, సంరక్షించి, పునరావాసం కల్పించడం ‘వంతారా’ ముఖ్య లక్ష్యం. వంతారా అనేది కృత్రిమ అడవి. గుజరాత్‌లోని జామ్‌నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో 3 వేల ఎకరాల్లో ఇది ఉన్నది. ఈ అడవిలో 25 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏనుగుల కోసం ప్రత్యేకంగా దవాఖాన ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్దది. ఇందులో దాదాపు 2వేల వన్యప్రాణులను సంరక్షిస్తున్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులు కూడా పనిచేస్తున్నారు.
Lion with Lion! 🔥
शेर के बच्चों संग खेलते प्रधानमंत्री श्री @narendramodi जी
यह सिर्फ एक तस्वीर नहीं, बल्कि भारत की शक्ति, स्नेह और आत्मविश्वास का प्रतीक है।#Vantara #WildlifeConservation pic.twitter.com/7S3XZxX0qB
— ज्योत्सना सिंह 🇮🇳 (@jyotsnassingh) March 4, 2025
Also Read..
Indian Student | ఇంకా కోమాలోనే భారత విద్యార్థిని.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన కుటుంబం
Maharashtra | మహా రాజకీయాల్లో కాకరేపుతున్న సర్పంచ్ హత్య కేసు.. మంత్రి పదవికి ధనంజయ్ ముండే రాజీనామా
MK Stalin | ఉత్తరాదిలో మూడో భాష ఏది..? కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్న