MK Stalin | ఉత్తరాదిలో మూడో భాష ఏది..? కేంద్రానికి తమిళనాడు సీఎం స్టాలిన్ ప్రశ్న
MK Stalin | జాతీయ విద్యావిధానం (National Education Policy) అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య ఒకరకంగా యుద్ధమే జరుగుతోంది.
MK Stalin | జాతీయ విద్యావిధానం (National Education Policy) అమలు విషయంలో కేంద్రం, తమిళనాడు ప్రభుత్వం మధ్య ఒకరకంగా యుద్ధమే జరుగుతోంది. కేంద్రం ప్రతిపాదించిన త్రిభాషా సూత్రాన్ని స్టాలిన్ (MK Stalin) ప్రభుత్వం ముందు నుంచీ వ్యతిరేకిస్తూ వస్తోంది. తమిళనాడు ప్రభుత్వం నిర్ణయంపై పలు వర్గాల నుంచి మద్దతు లభిస్తుండగా.. మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు. తమిళనాడులో విద్యార్థులకు మూడో భాషను నేర్చుకోవడానికి ఎందుకు అనుమతించడం లేదని కొందరు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయంపై సీఎం స్టాలిన్ తాజాగా స్పందించారు. మూడు భాషల ఫార్ములాను (three-language formula) తాను వ్యతిరేకిస్తున్నట్లు స్టాలిన్ మరోసారి స్పష్టం చేశారు.
‘తమిళనాడు విద్యార్థులు మూడో భాషను నేర్చుకునేందుకు ఎందుకు నిరాకరిస్తున్నారంటూ మమ్మిల్ని ప్రశ్నిస్తున్నారు. మరి ఉత్తరాదిలో మూడో భాషగా దేనిని నేర్పుతున్నారో మాత్రం చెప్పరెందుకు..?. అక్కడ రెండు భాషలను మాత్రమే బోధిస్తున్నట్లయితే ఇక్కడ మాత్రం మూడు భాషాలను నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది..?’ అని కేంద్రంలోని మోదీ ప్రభుత్వాన్ని సీఎం స్టాలిన్ నిలదీశారు. త్రిభాషా సూత్రం ప్రకారం ఉత్తరాదిన ఏ భాష నేర్పిస్తున్నారో చెప్పాలని కేంద్రాన్ని స్టాలిన్ డిమాండ్ చేశారు.
మరోవైపు, స్టాలిన్ కుమారుడు, తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ సైతం ఇదే అంశంపై కేంద్రాన్ని నిలదీశారు. జాతీయ విద్యావిధానం ముసుగులో కేంద్రం తమపై హిందీ భాషను బలవంతంగా రుద్దుతోందని ఆరోపించారు. ఇలాంటి ప్రయత్నాలను తాము అంగీకరించబోమని స్పష్టం చేశారు. తాము మాత్రం ఎప్పటికీ జాతీయ విద్యా విధానాన్ని అమలు చేయబోమని ఆయన తేల్చిచెప్పారు.
Also Read..
Arvind Kejriwal | విపశ్యన ధ్యానం కోర్సుకు వెళ్లనున్న కేజ్రీవాల్.. పదిరోజుల పాటూ అక్కడే..!
Viral Video | డ్రైవర్ వేధింపులు.. చెప్పుతో కొట్టిన మాజీ సీఎం కుమార్తె
Donald Trump | రష్యాపై ఆంక్షలు ఎత్తివేసే దిశగా ట్రంప్ సర్కార్ అడుగులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

