Donald Trump | రష్యా – ఉక్రెయిన్ యుద్ధంలో ముందు నుంచీ రష్యా (Russia) అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన ట్రంప్.. రష్యాపై ఇప్పుడు మరింత ప్రేమను చూపిస్తున్నారు. యుద్ధం ముగింపు మాత్రమే కాకుండా మాస్కోతో సంబంధాలను మరింత బలపరచుకోవాలని ఆశిస్తున్నారు. ఇందులో భాగంగా రష్యాపై ఆంక్షలను ఎత్తివేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో ప్రపంచ దేశాలు రష్యాపై పలు ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ ఆంక్షలను తొలగించాలని ట్రంప్ యోచిస్తున్నట్లు తెలిసింది. రష్యాకు చెందిన కొన్ని సంస్థలు, వ్యక్తులకు ఉపశమనం కల్పించే దిశగా ట్రంప్ సర్కార్ చర్యలు చేపట్టినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంటోంది. ఇందుకు సంబంధించిన ముసాయిదా జాబితాను రూపొందించాలని విదేశీ వ్యవహారాలు, ట్రెజరీ మంత్రిత్వ శాఖలను వైట్ హౌస్ (White House) ఆదేశించినట్లు సదరు కథనాలు వెల్లడించాయి. దీనిపై రష్యన్ ప్రతినిధులతో అమెరికా అధికారులు చర్చలు జరిపేందుకు సన్నాహకాలు చేస్తున్నట్టు సమాచారం.
Also Read..
Tariff War | చైనా ఉత్పత్తులపై మరో 10 శాతం సుంకాలు పెంచిన ట్రంప్
Donald Trump | ఉక్రెయిన్ ట్రంప్ షాక్.. సైనిక సాయం నిలిపివేసిన అమెరికా