హైదరాబాద్ : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ చేత కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దం చెప్పించిందని ఎమ్మెలేయ పాడి కౌశిక్ రెడ్డి ( MLA Padi Kaushik) ఆరోపించారు.
ఆరు గ్యారెంటీ ( Six Guarantees ) ల గురించి గవర్నర్ ప్రసంగంలో లేనే లేదని సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద పేర్కొన్నారు.
మొదటి వంద రోజుల్లోనే ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలు చేస్తామని హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ ( Congress Party) అధికారంలోకి వచ్చి రెండేళ్లకు పైగా అవుతుంది. ఇచ్చిన హామీలపై గవర్నర్ ప్రసంగంలో ఉంటుందేమో అనుకున్నాం. కాని ఆ ఊసే లేదని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత మూడో బడ్జెట్ ప్రవేశ పెడుతుందని అన్నారు.
రైతు భరోసా 15 వేలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఇవ్వలేదు. రైతు భరోసా ఇస్తున్నాం. రైతుల అకౌంట్లో పడుతుందో, లేదో నాకు తెలియదని రేవంత్ రెడ్డి నిర్లక్ష్యంగా మాట్లాడారని ఆరోపించారు. కళ్యాణ లక్ష్మి , తులం బంగారం ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదు. ఒకే ఇంట్లో ఇద్దరికి పించన్లు ఇస్తామని చెప్పారు. యువకులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఈ అంశాలు గవర్నర్ ప్రసంగంలో లేనే లేదని అన్నారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వెళ్లి యువకులను రెచ్చగొట్టారని ఆరోపించారు.