Tariff War | చైనా ఉత్పత్తులపై మరో 10 శాతం సుంకాలు పెంచిన ట్రంప్
అమెరికా, చైనాల మధ్య టారిఫ్ వార్ (Tariff War) కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాపై 10 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని 20 శాతానికి పెంచుతూ ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు.
వాషింగ్టన్: అమెరికా, చైనాల మధ్య టారిఫ్ వార్ (Tariff War) కొనసాగుతున్నది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత చైనాపై 10 శాతం సుంకాలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా దాన్ని 20 శాతానికి పెంచుతూ ఉత్తర్వులపై ట్రంప్ సంతకాలు చేశారు. ఫెంటనిల్ డ్రగ్స్ అక్రమ రవాణాను అడ్డుకోవడంలో చైనా విఫలమైందని, అందుకే 10 శాతంగా ఉన్న సంకాలను 20 శాతానికి పెంచుతునట్లు వైట్‌హౌస్ వర్గాలు వెల్లడించాయి.
అమెరికా నిర్ణయంతో బీజింగ్ కూడా ఇదే తరహాలో స్పందించే అకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. అమెరికా వ్యవసాయ, ఆహార ఉత్పత్తులను లక్ష్యంగా చేసుకోవచ్చని చైనాకు చెందిన గ్లోబల్ టైమ్స్ న్యూస్‌పేపర్ వెల్లడించింది. కాగా, చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 10 శాతం సుంకాలు విధిస్తూ ఫిబ్రవరి 2న ట్రంప్ ఆదేశాలు జారీచేశారు. ప్రతిగా చైనా కూడా అమెరికా దిగుమతులపై 10 నుంచి 15 శాతం సుంకాలు విధించింది. గత నెల 11 నుంచే వాటిని అమలు చేస్తున్నది. ఇక మెక్సికో, కెనడాలపై కూడా అమెరికా 25 శాతం టారీఫ్ విధించింది. దీంతో అమెరికా దిగుమతులపై కూడా అంతే మొత్తంలో కెనడా సుంకాలు విధించారు.
కాగా, కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకాల విషయంలో ఎలాంటి మార్పు లేదని ట్రంప్ స్పష్టం చేశారు. పెంచిన సుంకాలు మార్చి 4 (అమెరికా కాలమానం ప్రకారం) నుంచి యథావిధిగా అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ఫిబ్రవరి 4 నుంచే ఇవి అమల్లోకి వస్తాయని గతంలో ప్రకటించినప్పటికీ ఇరు దేశాల అధ్యక్షుల విజ్ఞప్తి మేరకు దానిని నెల రోజుల పాటు వాయిదా వేశారు. ఆ గడువు నేటితో ముగియనుంది. దీంతో మెక్సికో, కెనడాపై సుంకాలు మంగళవారం నుంచి అమల్లోకి వస్తాయని ట్రంప్ వెల్లడించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- America
- china
- Donald Trump
- imports
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

