Donald Trump | పుతిన్ కంటే వారితోనే అధిక ముప్పు.. అక్రమ వలసదారులపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్య
అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంటే అక్రమ వలసదారులతోనే ముప్పు ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు.
న్యూఢిల్లీ: అమెరికాలో అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంటే అక్రమ వలసదారులతోనే ముప్పు ఎక్కువగా ఉన్నదని పేర్కొన్నారు. ఈ మేరకు ‘ట్రూత్’ సామాజిక మాధ్యమంలో ఓ పోస్టు పెట్టారు. పుతిన్ గురించి తాను ఆందోళన చెందడం లేదని, అమెరికాకు యూరప్ గతి పట్టకుండా చూసేందుకు అక్రమ వలసలను నిరోధించడంపైనే దృష్టి కేంద్రీకరించానని తెలిపారు.
పుతిన్ గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదని, అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తున్న రేప్ గ్యాంగ్‌లు, డ్రగ్ లార్డులు, హంతకులు, మెంటల్ సంస్థల వ్యక్తులపైనే మనం దృష్టి సారించాలని, అప్పుడే మనకు యూరప్ లాంటి పరిస్థితి ఏర్పడదని స్పష్టం చేశారు. గత నెల రోజుల్లో తాను చేపట్టిన చర్యల వల్ల అమెరికా-మెక్సికో సరిహద్దుల్లో అక్రమ వలసలు చారిత్రక కనిష్ఠ స్థాయికి తగ్గాయని మరో పోస్టులో ట్రంప్ వెల్లడించారు. ఫిబ్రవరిలో అమెరికా సరిహద్దు వద్ద కేవలం 8,326 మంది అక్రమ వలసదారులు మాత్రమే పట్టుబడ్డారని, వారందరినీ వెంటనే వెనక్కి పంపేశామని వివరించారు. జో బైడెన్ అధికారంలో ఉన్నప్పుడు అమెరికాలోకి ప్రతి నెలా దాదాపు 3 లక్షల మంది అక్రమంగా ప్రవేశించేవారని విమర్శించారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | జైలర్ 2 క్లైమాక్స్ షూట్లో తలైవా టీంతో మోహన్ బాబు.. ట్రెండింగ్‌లో స్టిల్
Manipur Violence | మణిపూర్ హింసాకాండలో నలుగురు మృతి.. సీఎం నివాసం వద్ద మృతదేహాలతో నిరసన
AP Parishad Elections | ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల.. నవంబర్ 3న పోలింగ్
‘యువత చెడు మార్గాలను వదిలి భక్తి మార్గంలో నడవాలి’
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

