Train | ఉత్తరప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఓ రైలు (Train) రెండుగా విడిపోయింది. ఈ ఘటనతో ప్రయాణికులు (Passengers) తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే, అదృష్టవశాత్తూ ఎవరికీ ఎలాంటి గాయాలూ కాకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ (Nandan Kanan Express) రైలు సోమవారం ఢిల్లీ నుంచి ఒడిశాలోని పూరికి బయల్దేరింది. అయితే, ఈ రైలు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ (Chandauli)లో గల పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ (Pandit Deen Dayal Upadhyaya Junction) సమీపంలోకి రాగానే రెండుగా విడిపోయింది (Train Splits Into Two). కప్లింగ్ విరిగిపోవడంతో (Coupling Breaks) S-4, S-5 కోచ్‌లు రెండుగా విడిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన అధికారులు చర్యలు చేపట్టారు. ప్రయాణికులను మరొక కోచ్‌కు తరలించారు. దాదాపు నాలుగు గంటలు శ్రమించి సమస్యను పరిష్కరించారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. రైలు వేగం తక్కువగా ఉండటంతో ప్రమాదం తప్పినట్లు ఓ ప్రయాణికుడు తెలిపారు.
#WATCH | Chandauli, Uttar Pradesh: The coupling of the Nandan Kanan Express broke near the Pandit Deen Dayal Upadhyaya (DDU) Junction, splitting it into two parts. pic.twitter.com/QjqUHN7tfe
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 4, 2025
Also Read..
PM Modi | వంతారాలో సింహం పిల్లలతో మోదీ.. వీడియో
Indian Student | ఇంకా కోమాలోనే భారత విద్యార్థిని.. హెల్త్ అప్డేట్ ఇచ్చిన కుటుంబం
Maharashtra | మహా రాజకీయాల్లో కాకరేపుతున్న సర్పంచ్ హత్య కేసు.. మంత్రి పదవికి ధనంజయ్ ముండే రాజీనామా