నవాబ్‌పేట, ఫిబ్రవరి 26 : వ్యవసాయ పొలంలో రైతు విద్యుదాఘాతానికి గురై మృతి చెందిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో చోటు చేసుకున్నది. ఎస్సై విక్రమ్ తెలిపిన వివరాలిలా.. నవాబ్‌పేట మండలం చిన్న మేఘ్యానాయక్ తండాకు చెందిన గిరిజన రైతు మేగావత్ వెంకటేశ్(47) తండా శివారులోని ఐదు ఎకరాల్లో వేరుశనగ పంట సాగు చేశాడు.
బుధవారం రాత్రి పంటకు నీళ్లు పెట్టేందుకు పొలం వద్దకు వెళ్లాడు. విద్యుత్ మోటర్ ఆన్‌చేసే క్రమంలో ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. వెంకటేశ్ భార్య లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.