Air Pollution | దేశ రాజధాని ఢిల్లీని వాయు కాలుష్యం (Air Pollution) ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. అనేక ప్రాంతాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో విజిబిలిటీ దారుణంగా పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (CPCB) ప్రకారం గురువారం ఉదయం ఢిల్లీలో గాలి నాణ్యత సూచిక (AQI) 358 వద్ద నమోదైంది.
తీవ్ర కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రాప్ IV కింద కఠినమైన కాలుష్య నియంత్రణ చర్యలను అమలు చేస్తోంది. ఈ చర్యల్లో భాగంగా నేటి నుంచి కాలుష్య నియంత్రణ పత్రం (PUC certificate) లేని వాహనాలకు పెట్రోల్ బంకుల్లో ఇంధనం నింపరు. పాత వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశం నిషేధించారు. బీఎస్-6 కంటే తక్కువ ప్రమాణాలు ఉండే ఢిల్లీయేతర ప్రైవేట్ వాహనాలను రాజధానిలోకి అనుమతించరు.
‘ఢిల్లీయేతర నాన్-BS6 వాణిజ్య, ప్రైవేట్ వాహనాలను బార్డర్ వద్ద తనిఖీలు చేస్తున్నాము. కాలం చెల్లిన పాత వాహనాలను రాజధానిలోకి అనుమతించడం లేదు. నిబంధనలు ఉల్లంఘించి నగరంలోకి ప్రవేశిస్తే.. రూ.20 వేలు జరిమానా విధిస్తాం. అదేవిధంగా కాలుష్య నియంత్రణ ధృవీకరణ పత్రం లేని డ్రైవర్లకు కూడా జరిమానా విధిస్తున్నాము’ అని ఢిల్లీ రవాణా శాఖ అధికారి దిలీప్ తెలిపారు.నిత్యం పొరుగు రాష్ట్రాల నుంచి ఢిల్లీకి దాదాపు 15 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ప్రభుత్వ నిర్ణయంతో 12 లక్షల వాహనాలపై ప్రభావం పడనుంది. మరోవైపు గ్రాఫ్ ఫోర్ నిబంధనల నేపథ్యంలో ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తున్నారు.
Also Read..
Dense Fog | ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. 40 విమానాలు, 20కిపైగా రైళ్లు ఆలస్యం
Ram Suthar | 125 అండుగుల అంబేద్కర్ విగ్రహ రూపకర్త రామ్ సుతార్ కన్నుమూత
Fire Breaks | ఎల్ఐసీ భవనంలో అగ్నిప్రమాదం.. ఒకరు సజీవదహనం