Dense Fog | ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. 40 విమానాలు, 20కిపైగా రైళ్లు ఆలస్యం
కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది. ఎదురుగా ఉన్నవారు కూడా కనిపించని (Visibility) పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి కూడా బయటకు రాలేకపోతున్నారు.
న్యూఢిల్లీ: కాలుష్య కాసారంగా మారిన ఢిల్లీలో దట్టమైన పొగమంచు (Dense Fog) కమ్మేసింది. ఎదురుగా ఉన్నవారు కూడా కనిపించని (Visibility) పరిస్థితి ఏర్పడింది. దీంతో నగరంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు ఇండ్ల నుంచి కూడా బయటకు రాలేకపోతున్నారు. మంచు దుప్పటి కప్పేయడంతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడింది. ఇందిరాగాంధీ విమానాశ్రయంలో (IGI) సుమారు 40 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. అదేవిధంగా 22కు పైగా రైళ్లు ఆలస్యమయ్యాయి.
ఫ్లైట్ ఆపరేషన్స్ ప్రస్తుతం సీఏటీ 3 కండీషన్స్‌లో ఉన్నాయని, ఈ నేపథ్యంలో విమాన రాకపోకపోకలు ఆలస్యమవడం లేదా రద్దవడం వంటివి జరగవచ్చని విమానాశ్రయ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపారు. ప్రయాణికులు తాము వెళ్లాల్సిన విమానాల సమయాలను గురించి ఎప్పటికప్పుడు సంబంధిత ఎయిర్‌లైన్స్‌తో కాంటాక్ట్‌లో ఉండాలని సూచించారు.
ఇక రాజధానిలో చాలా ప్రాంతాల్లో దృశ్యమానత తగ్గిపోవడంతో రహదారుల వెంబడి వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఢిల్లీని ఎన్సీఆర్ పరిధిలోని ప్రాంతాలతో కలిపి హైవేలపై కూడా ఇదే పరిస్థితి నెలకొన్నది. కాగా, కాలుష్యం నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రూప్ IV కింద అత్యంత కఠినమైన కాలుష్య నియంత్రణలు అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో ఒకటి నుంచి ఐదో తరగతుల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారు. మిగిలినవారికి హైబ్రీడ్ మోడ్‌లో క్లాసుల జరుగనున్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- AQI
- Delhi
- Delhi pollution
- Flights
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

