Ram Suthar | ట్యాంక్‌బండ్‌లోని 125 అడుగుల బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ రూపకర్త, ప్రఖ్యాత భారత శిల్పి రామ్ వాంజీ సుతార్ (Ram Sutar) కన్నుమూశారు. నోయిడాలోని కుమారుడి నివాసంలో ఆయన తుది శ్వాస విడిచారు. ఈ మేరకు ఆయన కుమారుడు అనిల్ సుతార్ వెల్లడించారు. గుజరాత్‌లోని స్టాచ్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని కూడా రామ్ సుతార్ తీర్చిదిద్దారు. 1925 ఫిబ్రవరి 19న మహారాష్ట్రలోని గోందూర్లో ఆయన జన్మించారు. రామ్ సుతార్‌ను 1999లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి.
దేశంలోనే అత్యంత ఎత్తయిన అంబేద్కర్ విగ్రహాన్ని 132వ జన్మదినం సందర్భంగా 2023 ఏప్రిల్ 14న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ విగ్రహం నిర్మాణానికి 791 టన్నుల స్టీల్, 96 మెట్రిక్ టన్నుల ఇత్తడిని వినియోగించారు. గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తర్వాత అతిపెద్ద విగ్రహం హైదరాబాద్‌లో నిర్మించిన అంబేద్కర్ విగ్రహమే కావడం విశేషం.