Nitish Kumar | 2024 లోక్సభ ఎన్నికల్లో బీజేపీని గద్దెదించడమే లక్ష్యంగా ఏర్పాటైన ‘ఇండియా’ (INDIA) కూటమి పరిస్థితి మూన్నాళ్ల ముచ్చటలానే ఉంది. కీలక నేతలు కూటమి నుంచి బయటకు వస్తున్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వచ్చే లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా బీహార్ సీఎం నితీశ్ కుమార్ (Nitish Kumar) సైతం ఇండియా కూటమిని వీడేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. త్వరలోనే ఎన్డీఏ కూటమిలో చేరాలని నితీశ్ నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ అంశంపై రెండు లేదా మూడు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశం ఉందని తెలిపాయి.
ఏ కూటమిలోనూ ఎక్కువ కాలం కొనసాగని బీహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్.. మరోసారి తన పాత మిత్రులవైపు అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. కాంగ్రెస్తో జట్టుకట్టిన నితీశ్ గత రెండు మూడేండ్లుగా బీజేపీకి వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమిని ఏర్పాటుచేయడంలో కీలకంగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆయన మళ్లీ బీజేపీ వైపు మొగ్గుతున్నట్టు సమాచారం. ఇండియా కూటమిలోని ఆర్జేడీతో ఏర్పడిన విభేదాల నేపథ్యంలో నితీశ్ తిరిగి ఎన్డీఏతో చేతులు కలిపేందుకు పావులు కదుపుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, దీనిపై రెండు మూడు రోజుల్లో స్పష్టత రానున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి.
Also Read..
Mahmood Ali | గణతంత్ర వేడుకల్లో అస్వస్థతకు గురైన మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ
Republic Day | భారత్కు రష్యా స్పెషల్ విషెస్.. గదర్ పాటకు స్టెప్పులేసి
Emmanuel Macron | భారతీయ విద్యార్థులకు గుడ్న్యూస్ చెప్పిన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్