Nithari Case | దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిథారీ కేసులో హత్య కేసులో సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ను విచారించేందుకు సర్వోన్నత న్యాయస్థానం బుధవారం అంగీకరించింది. అలహాబాద్ హైకోర్టు గతేడాది అక్టోబర్లో ఈ కేసులో ఓ నిందితుడైన సురేంద్ర కోలీని నిర్దోషిగా ప్రకటించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు సీబీఐని ఆశ్రయించింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం సీబీఐతో పాటు పలువురు దాఖలు చేసిన పిటిషన్ల అటాచ్ చేసింది. గత జూలై 19న సీబీఐ సహా పలువురు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణకు స్వీకరించిన కోర్టు.. ఆయా పిటిషన్లపై సురేంద్ర కోలీకి నోటీసులు జారీ చేస్తూ సమాధానం చెప్పాలని కోరింది.
సుప్రీంకోర్టులో బాధితురాలి తండ్రి సైతం పిటిషన్ దాఖలు చేశారు. నిథారీ కేసులో సెషన్స్ కోర్టు మొనీందర్ సింగ్ పంధేర్ నిర్దోషిగా ప్రకటించగా.. సురేంద్ర కోలీకి సెప్టెంబర్ 2010 సెప్టెంబర్ 28న మరణ శిక్ష విధించింది. కోలీకి 12 కేసుల్లో, పందేర్కు రెండు కేసుల్లో విధించిన మరణశిక్షను అలహాబాద్ హైకోర్టు రద్దు చేసింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాధారల ఆధారంగా నిందితులిద్దరిపై నేరాన్ని రుజువు చేయడంలో విఫలమైందని తెలిపింది. నిథారీ కేసులో మోనీందర్ సింగ్ పంధేర్, సురేంద్ర కోలీపై లైంగిక దాడి, హత్య ఆరోపణలున్నాయి. డిసెంబర్ 29, 2006న దేశ రాజధానికి సరిహద్దులో ఉన్న నోయిడాలోని నిథారిలోని మొనీందర్ సింగ్ పంధేర్ నివాసంలో మానవ అవశేషాలు కనిపించాయి.
పంధేర్ ఇంటి లోపల ఉన్న పెరడులోని కాలువ వద్ద ఎనిమిది మంది పిల్లల అస్థిపంజరాలు, ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పిల్లలను మభ్యపెట్టి ఇంట్లోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడి.. హత్య చేసినట్లుగా నిందితులపై ప్రధాన ఆరోపణ. ఆ ప్రాంతంలో తప్పిపోయిన పిల్లలు, యువకులను అపహరించి సాక్ష్యాలు దొరకకుండా నరికి కాలువలో పడేశారని.. అలాగే, ఇద్దరు నరమాంస భక్షకులనే ఆరోపణలున్నాయి. పంధేర్, కోలీపై పలు కేసులు నమోదయ్యాయి. కోలీపై మొత్తం 16 కేసులు నమోదు కాగా వాటిల్లో 12 కేసుల్లో ట్రయల్ కోర్టులు మరణ శిక్ష విధించాయి. మూడు కేసుల్లో నిర్దోషిగా ప్రకటించగా.. ఓ కేసులో మరణశిక్షను జీవితఖైదుగా మార్చారు. పంధేర్కు ట్రయల్ కోర్టులు 2 కేసుల్లో మరణశిక్ష విధించాయి.
Tamil Nadu | ఆలయ ఉత్సవాల్లో అపశృతి.. నిప్పుల గుండంపై పడి ఏడేళ్ల బాలుడికి గాయాలు
Ayodhya: అయోధ్యలో 50 లక్షల ఖరీదైన వీధి లైట్లు చోరీ
Doda Encounter | ప్రతికారం తీర్చుకున్న భద్రతా బలగాలు.. ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు హతం..!