Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఓ ఆలయ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిప్పుల గుండంపై నడుస్తున్న క్రమంలో ఏడేళ్ల బాలుడు కిందపడి గాయాలపాలయ్యాడు. ఈ ఘటన తిరువళ్లూరు (Thiruvallur) జిల్లాలో ఆదివారం చోటు చేసుకుంది.
జిల్లాలోని ఆరంబాక్కం సమీపంలో గల కట్టుకొల్లైమేడు గ్రామంలో మరియమ్మన్ ఆలయ ఉత్సవాలను గ్రామస్థులు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా గ్రామస్థులు నిప్పుల గుండంపై (firewalking ritual) నడిచారు. సుమారు 100 మంది స్థానికులు అమ్మవారిని స్మరించుకుంటూ ఒకరి తర్వాత ఒకరు నిప్పులు గుండంపైకి వెళ్లసాగారు. ఈ క్రమంలో ఏడేళ్ల బాలుడు మోనిష్ వంతు వచ్చింది. నిప్పుల వేడికి ఆ పిల్లాడు భయపడి వెనకడుగు వేశాడు.
దీంతో ఊరి పెద్దలు మరో వ్యక్తితో కలిసి ఆ బాలుడిని నిప్పుల గుండంపైకి పంపారు. ఈ క్రమంలో ఒక్కసారిగా బాలుడు నిప్పులపై పడిపోయాడు. ఈ ఘటనలో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే స్పందించిన ఊరి జనం.. ఆ పిల్లాడిని అక్కడి నుంచి బయటకు తీసుకొచ్చారు. అనంతరం సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.
#திருவள்ளூரில்: தீ’மிதி திருவிழாவில் தங்கள் விருப்பங்கள் நிறைவேறும் என்ற நம்பிக்கையில் தீயில் நடந்த பக்தர்கள். 7 வயது மோனிஷ் தீ’க்கு அருகில் வந்ததும் தயங்கி நின்றார் , ஒரு பெரியவர் அவரை இழுத்துச்சென்றார், மோனிஷ் சமநிலையை இழந்து தீக்காயங்களுடன் விழுந்தார்#Thiruvallur #temple pic.twitter.com/b2AoRipIBK
— M.M.NEWS உடனடி செய்திகள் (@rajtweets10) August 13, 2024
Also Read..
Air India | లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో సాంకేతిక సమస్య.. ముంబైకి దారి మళ్లింపు
Manish Sisodia | మళ్లీ డిప్యూటీ సీఎం పగ్గాలు..? మనీశ్ సిసోడియా సమాధానం ఇదే..!