Air India | ముంబై నుంచి లండన్ వెళ్తున్న (London-bound flight) ఎయిర్ ఇండియా (Air India) విమానంలో సాంకేతిక సమస్య (Technical Issue) తలెత్తింది. దీంతో టేకాఫ్ అయిన కొద్ది సేపటికే విమానాన్ని తిరిగి ముంబైకి దారి మళ్లించారు. అక్కడ విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు ఎయిర్ ఇండియా ప్రతినిధి తెలిపారు.
ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం సాంకేతిక లోపం కారణంగా బుధవారం ముంబైకి తిరిగి వచ్చినట్లు చెప్పారు. ఛత్రపతి శివాజీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం సురక్షితంగా ల్యాండ్ అయినట్లు తెలిపారు. అయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా విమానాన్ని తనిఖీల కోసం పంపినట్లు వెల్లడించారు. ‘ముంబై నుంచి లండన్ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI129లో సాంకేతిక సమస్య కారణంగా ముంబైకి తిరిగి వచ్చింది. ఎయిర్‌పోర్ట్‌లో సురక్షితంగా ల్యాండ్ అయ్యింది. ఊహించని ఈ అంతరాయం కారణంగా ప్రయాణికులకు కలిగిన అసౌకర్యానికి మేము చింతిస్తున్నాము’ అని ఎయిర్ ఇండియా ప్రతినిధి పేర్కొన్నారు.
విమానయాన సంస్థ ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. విమాన టిక్కెట్ రద్దు చేసుకోవాలనుకునే ప్రయాణికులకు పూర్తిగా రీఫండ్ అందించనున్నట్లు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత, శ్రేయస్సుకు సంస్థ ప్రాధాన్యత ఇస్తుందని ఈ సందర్భంగా సదరు అధికారి పేర్కొన్నారు.
Also Read..
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు
Manish Sisodia | మళ్లీ డిప్యూటీ సీఎం పగ్గాలు..? మనీశ్ సిసోడియా సమాధానం ఇదే..!
Encounter | జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్.. ఆర్మీ కెప్టెన్ మృతి