Encounter | జమ్మూ కశ్మీర్ (Jammu And Kashmir)లో ఉగ్రవాదుల (Terrorists) ఏరివేత కొనసాగుతోంది. దేశ రక్షణకై జవాన్లు (Soldiers) ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడుతున్నారు. ఈ క్రమంలో ఎంతో మంది జవాన్లు ఎదురు కాల్పుల్లో (Encounter) ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా బుధవారం కూడా జమ్మూలోని దోడా (Doda) జిల్లాలో ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆర్మీ కెప్టెన్ (Army Captain Killed) అమరుడయ్యారు.
దోడా జిల్లాలోని అస్సార్ ప్రాంతంలో నలుగురు ఉగ్రవాదులు నక్కిఉన్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. ఈ క్రమంలో అక్కడ ఎన్కౌంటర్ చోటు చేసుకుంది. ఈ ఎదురు కాల్పుల్లో 48వ రాష్ట్రీయ రైఫిల్స్ (48 Rashtriya Rifles) కెప్టెన్ ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తెలిపారు. ఇక ఈ ఎన్కౌంటర్లో ఓ ఉగ్రవాదిని కూడా భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. అత్యాధునిక ఎం4 రైఫిల్‌ను స్వాధీనం చేసుకొన్నాయి. వీటితోపాటు మూడు బ్యాక్‌ప్యాక్ బ్యాగ్‌లను ఆ ప్రాంతంలో గుర్తించారు.
A Captain of the Indian Army from the 48 Rashtriya Rifles was killed in action during the ongoing Op Assar in Doda district. Operations are still in progress: Defence officials pic.twitter.com/i40wzOrJrj
— ANI (@ANI) August 14, 2024
Also Read..
High alert | స్వాతంత్య్ర వేడుకల్లో ఆత్మాహుతి దాడికి కుట్ర.. ఢిల్లీలో హై అలర్ట్
Arvind Kejriwal | కేజ్రీవాల్‌కు చుక్కెదురు.. మధ్యంతర బెయిల్ ఇవ్వలేమన్న సుప్రీంకోర్టు
Air India | ముంబై వెళ్లే విమానాన్ని ఢీ కొట్టిన పక్షి.. టేకాఫ్‌ను నిలిపివేసిన అధికారులు