Air India | ఎయిర్ ఇండియా విమానానికి (Air India flight) ప్రమాదం తప్పింది. టేకాఫ్ సమయంలో పక్షి ఢీ (bird hit) కొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే టేకాఫ్న నిలిపివేసినట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఎయిర్ ఇండియాకు చెందిన విమానం ఇవాళ ఉదయం గోవా (Goa) నుంచి ముంబైకి (Mumbai) వెళ్లేందుకు సిద్ధంగా ఉంది. దబోలిమ్ విమానాశ్రయంలో ఉదయం 6:45 గంటల సమయంలో టేకాఫ్ కోసం రన్‌వేపైకి వెళ్లింది. ఆ సమయంలో ఓ పక్షి విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో అప్రమత్తమైన సిబ్బంది వెంటనే విమానం టేకాఫ్‌ను రన్‌వే వద్ద నిలిపివేసినట్లు విమానాశ్రయంలో సీనియర్ అధికారి ఒకరు పీటీఐకి తెలిపారు.
ఆరు విమాన సర్వీసులు ప్రారంభం ..!
టాటా సన్స్ అనుబంధ ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ (Air India Express) దేశీయ విమాన ప్రయాణ నెట్వర్క్ బలోపేతం దిశగా అడుగులేస్తున్నది. కోల్‌కతా, చెన్నైలతోపాటు కొత్త రూట్లలో ఆరు రోజువారీ విమాన సర్వీసులు నడుపనున్నది. కోల్ కతా నుంచి రెండు, చెన్నై నుంచి మూడు, గువాహటి- జైపూర్ సెక్టార్ మధ్య ఒక విమాన సర్వీసు నడుపుతామని ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ మంగళవారం తెలిపింది. చెన్నై-భువనేశ్వర్, చెన్నై-బాగ్దొగ్రా, చెన్నై-తిరువనంతపురం, కోల్‌కతా- వారణాసి, కోల్‌కతా – గువాహటి, గువహాటి- జైపూర్‌లకు విమాన సర్వీసులు నడుపుతుంది. ప్రస్తుతం ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ రోజువారీగా 82 విమానాలతో 380కి పైగా విమాన సర్వీసులు నిర్వహిస్తున్నది.
Also Read..
Sheikh Hasina | నాకు న్యాయం కావాలి.. బంగ్లాదేశ్‌లో హింసాత్మక ఘటనలపై తొలిసారి స్పందించిన షేక్ హసీనా
Gallantry Awards | 1037 మందికి గ్యాలంట్రీ అవార్డులు.. ప్రకటించిన హోం శాఖ