రామవరం, జనవరి 05 : సింగరేణి కొత్తగూడెం ఏరియాలోని పద్మావతి ఖని మైన్ను కోల్ క్వాలిటీ ఆర్గనైజషన్ బృందం సోమవారం సందర్శించింది. పద్మావతి ఖని మైన్ నందు వార్షిక బొగ్గు గ్రేడ్ వెరిఫికేషన్ కోల్ క్వాలిటీ ఆర్గనైజషన్ బృందం పరిశీలించింది. ప్రతి సంవత్సరం ఉత్పత్తి అవుతున్న బొగ్గు నాణ్యతను మేనేజర్ ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు అండర్ గ్రౌండ్ మైన్ లో దిగి బొగ్గు ఉత్పత్తి చేయు ప్రదేశాలకు వెళ్లి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ (సీసీఓ), దుర్గ ప్రసాద్, (డీజీఎం) కోల్ క్వాలిటీ కంట్రోల్, కార్పొరేట్, కే.ఎస్.ఎన్ రాజు, డీజీఎం (కోల్ క్వాలిటీ కంట్రోల్), కొత్తగూడెం ఏరియా, ఏజెంట్ పద్మావతి ఖని రామ్ భరోస్ మహాతో, మేనేజర్ డా.ఎం.వి.ఎన్ శ్యామ్ ప్రసాద్, క్వాలిటీ కంట్రోల్ ఇన్చార్జి శ్రావణ్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు.